ఉరేసుకుని యువతి బలవన్మరణం | young woman suicide in nalgonda | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని యువతి బలవన్మరణం

Published Thu, Jun 13 2024 11:57 AM | Last Updated on Thu, Jun 13 2024 11:57 AM

young woman suicide in nalgonda

ఉరేసుకుని యువతి బలవన్మరణం

పాలకవీడు: ఉరేసుకుని యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన పాలకవీడు మండలంలోని జాన్‌పహాడ్‌ గ్రామంలో బుధవారం జరిగింది. ఎస్‌ఐ లక్ష్మీనర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జాన్‌పహాడ్‌ గ్రామానికి చెందిన ఉబెల్లి ఉమ(27)కు మూడు నెలల క్రితం సూర్యాపేట జిల్లా మోతె మండలానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది. వారం రోజుల క్రితం పుట్టింటికి వచ్చిన ఉమ బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

 సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్‌నగర్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి మరియమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా తన భర్తకు జాబ్‌ లేదనే మనస్తాపంతో ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement