ఇటీవల మరణించిన కండక్టర్ ప్రవళిక పేరుతో చట్టం తేవాలి
ప్రభుత్వంపై ఆర్టీసీ కార్మీక సంఘాల ఒత్తిడి.. ముఖ్యమంత్రికి లేఖ
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికురాలి దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక పేరుతో కొత్త చట్టాన్ని తేవాలన్న డిమాండ్ ఆర్టీసీ కార్మీక సంఘాల నుంచి వస్తోంది. ‘చిల్లర’గొడవతో విచక్షణ కోల్పోయిన ప్రయాణికురాలు తోసేయటంతో బస్సులోంచి రోడ్డు మీద పడిపోయిన కండక్టర్ ప్రవళిక కాళ్లమీది నుంచి బస్సు వెనక చక్రాలు వెళ్లటంతో ఆమె తీవ్రంగా గాయపడింది.
పది రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది మరణించిన విష యం తెలిసిందే. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లపై తరచూ దాడు లు జరుగుతున్న నేపథ్యంలో, దాడి చేసిన వారికి కఠిన శిక్షలు విధించేలా ప్రవళిక పేరుతో ఓ చట్టాన్ని తీసుకురావాలంటూ కార్మీక సంఘాలు ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. ఆర్టీసీ సిబ్బంది కుటుంబాల నుంచి కూడా క్రమంగా ఈ డిమాండ్ పెరుగుతోంది.
తప్పించుకుంటున్న నిందితులు
నెలకు సగటున రెండు చొప్పున ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేసి గాయపరుస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సిబ్బంది ఫిర్యాదుతో పోలీసు కేసులు నమోదవుతున్నా, శిక్షలు లేకుండానే నిందితులు తప్పించుకుంటున్నారు. తాజాగా మణుగూరు డిపో కండక్టర్ ప్రవళికపై పాశవిక దాడి జరిగి, ఆమె ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనతో సిబ్బందిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లపై ఉన్న చిన్నచూపు వల్ల వారు తరచూ దాడులకు గురవుతున్నారు.
వారిపై దాడి చేస్తున్నా, బస్సులోని ప్రయాణికులు, రోడ్డు మీది ప్రజలు కూడా అండగా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో, దాడి చేసిన వారిపై కఠినమైన శిక్షలతో కూడిన కేసులు నమోదు చేయాల్సిందేనని ఆర్టీసీ సిబ్బంది గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి కేసుల్లో నేర స్వభావాన్ని బట్టి ఐపీసీ 332, 333, 353 వంటి సెక్షన్లు నమోదు చేసేవారు.
విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడికి సంబంధించి బీఎన్‌ఎస్ 121, 132 వంటి సెక్షన్లు వర్తించే అవకాశం ఉంది. కానీ చాలా సందర్భాల్లో సాధారణ దాడి లాంటి కేసులుగానే నమోదవుతుండటంతో స్టేషన్ బెయిల్ మీదనే చాలామంది బయటకు వస్తున్నారు. దీంతో ప్రవళిక పేరుతో కొత్త చట్టం తెచ్చి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని, దాడి చేసిన వారికి కేసు తీవ్రత మేరకు కచి్చతంగా శిక్ష ఉండేలా చూడాలని కోరుతున్నారు.
ముఖ్యమంత్రికి లేఖ
‘ఆరీ్టసీ సిబ్బంది చిన్న తప్పు చేసినట్టు సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేస్తే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. మరి ఆర్టీసీ íసిబ్బందిని చితక్కొడుతున్నా బాధ్యులపై కఠిన చర్యలు ఉండవా. సిబ్బందిపై దాడి చేస్తే జీవితకాలం శిక్ష అనుభవించాల్సి వస్తుందన్న భయం జనంలో రావాలి. ఆ మేరకు ప్రవళిక పేరుతో ఒక చట్టాన్ని తేవాలి’అని సీఐటీయూ అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి భాస్కర్ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.


