భర్త దుబాయ్‌ నుంచి రాలేదని.. | Woman Commits Suicide Husband In Dubai | Sakshi
Sakshi News home page

భర్త దుబాయ్‌ నుంచి రాలేదని..

Apr 24 2018 8:39 AM | Updated on Apr 24 2018 8:39 AM

Woman Commits Suicide Husband In Dubai - Sakshi

రసూల్‌పురా: దుబాయ్‌కి వెళ్లిన భర్త తిరిగి రాకపోవడంతో మనస్థాపానికిలోనైన ఓ మహిళ  అత్మహత్యకు పాల్పడిన సంఘటన బోయిన్‌పల్లి పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సాయి కిరణ్‌ కథనం మేరకు.. పాతబోయిన్‌పల్లి మిలట్రీ క్వార్టర్స్‌కు చెందిన సింధూజకు  2016లో కరీంనగర్‌ జిల్లా చొప్పదండికి చెందిన క్రిష్ణతో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత  క్రిష్ణ దుబాయ్‌కు వెళ్లడంతో సిందూజ తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. భర్త తిరిగి రాకపోవడంతో మనస్థాపానికి గురైన ఆమె ఆదివారం రాత్రి తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement