కరోనాతో భర్త మృతి చెందాడని.. గర్భిణి ఆత్మహత్య

Pregnant Lady Deceased Over Her Husband Deceased Of Corona - Sakshi

దొడ్డబళ్లాపురం: భర్త కరోనాతో మృతి చెందడంతో కలత చెందిన భార్య (గర్భిణి) ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కనకపుర పట్టణంలో చోటుచేసుకుంది. కనకపుర పట్టణ పరిధిలోని బసవేశ్వరనగర్‌లో నివసిస్తున్న బెస్కాం ఉద్యోగి నందిని (28)ఆత్మహత్యకు పాల్పడ్డారు.  నందిని రెండేళ్ల క్రితం మైసూరుకు చెందిన సతీష్‌ అనే వ్యాపారవేత్తను ప్రేమ వివాహం చేసుకుంది.

సతీష్‌ వ్యాపార నిమిత్తం మైసూరు, కనకపుర తిరిగేవారు. మైసూరులో ఉన్న సతీష్‌ తల్లి గతవారం కరోనాతో మృతి చెందింది. సతీష్‌కూ కరోనా సోకడంతో మూడు రోజుల క్రితం  మృతి చెందాడు. ప్రస్తుతం నందిని మూడు నెలల గర్భిణి. దీంతో కలత చెందిన నందిని గురువారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కనకపుర పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
చదవండి: బ్యుటీషియన్‌పై అత్యాచారం.. నటి బాడీగార్డ్‌పై కేసు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top