మనస్తాపంతో మహిళ ఆత్మహత్య

Woman Commits Suicide In Mahabubabad - Sakshi

కూతురు ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిపై కేసు పెట్టినా పట్టించుకోని పోలీసులు

అన్యాయం జరిగిందంటూ మనోవేదన

గుండెపుడిలో మృతురాలి బంధువుల ఆందోళన

మరిపెడ: మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, సీఐ ఇస్లావత్‌ శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. మరిపెడ మండలం గుండెపుడికి చెందిన వడ్లకొండ పిచ్చయ్య, ముత్తమ్మ దంపతుల రెండో కుమారుడి మల్లయ్యతో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రాలకు చెందిన రాయిండ్ల దుర్గాసాబ్,వీరమ్మ దంపతుల కుమార్తె లక్ష్మీ(45)తో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మమత, కుమారుడు జన్మించారు.

కుమారుడు మూడేళ్లకే నీటితొట్టిలో పడి మృతి చెందాడు.  మమత ఇంటర్‌ ఇరకు ఖమ్మంలోని ఉమెన్స్‌ కళాశాలలో చదివి అనంతరం హైదరాబాద్‌లోని కుట్టు మిషన్‌ నేర్చుకుంటున్న సమయంలో దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన సమీప బంధువు ఉపేందర్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం పెళ్లిదాక చేరుకోవడం, అనతరం ఉపేందర్‌ మ మతను పెళ్లి చేసుకోననడంతో జనవరి 27న ఆత్మహత్యకు పాల్పడింది. వీరి ప్రేమ విషయం తెలుసుకున్న మమత తల్లిదండ్రులు ప్రేమించిన వ్యక్తి పెళ్లిచేసుకోనని చెప్పడంతోనే మమత ఆత్మహత్యకు పాల్పడిందని మరిపెడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసుల విచారణ చేయకపోవడంతో కన్న కొడుకు చనిపోయి, ఆ తర్వాత కూతురు చనిపోవడంతో మానసిక క్షోభకు గురైన లక్ష్మీ ఆత్మహత్యకు పాల్పడింది.

ఎస్సైని సస్పెండ్‌ చేయాలి..
లక్ష్మీ ఆత్మహత్యకు కారణమైన మరిపెడ ఎస్సైని సస్పెండ్‌ చేయాలని దళిత సంఘాల నాయకులు గుండెపుడిలో ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాస్‌ మరో ఎస్సై ప్రసాద్‌రావుతో కలిసి గుండెపుడికి చేరుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని సీఐ చెప్పడంతో ఆందోళన విరమించారు. అలాగే మమత ఆత్మహత్యకు కారణమైన వారిపై కూడా నిర్భయ కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ విషయమై తొర్రూరు డీఎస్పీతో కూడా మాట్లాడించారు. అనంతరం లక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top