
సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చిన గౌతమి మృతదేహం , గౌతమి (ఫైల్)
చీరాల రూరల్: వేటపాలెం మండలం రామాపురం బీచ్‌లో మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన గురువారం ఉదయం జరిగింది. తమ కుమార్తె ఆత్మహత్యకు భర్త, అత్తమామలు, ఆడపడుచులే కారణమని మృతిరాలి తల్లిదండ్రులు ఈపురుపాలెం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి కథనంప్రకారం.. చీరాలలోని సంతబజారు రామాలయం వీధికి చెందిన కోట గౌతమి, వెంకట రామకృష్ణ మణికంఠ పవన్‌కుమార్ అలియాస్ పవన్‌లు భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది.
కుమారై, కుమారుడు ఉన్నారు. ఏం జరిగిందో ఏమోకానీ గురువారం ఉదయం ఏడు గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన గౌతమి రామాపురంలోని సముద్రంలో మునిగి ఆత్మహత్యకు పాల్పడింది. భారీగా వస్తున్న అలల తాకిడికి గౌతమి మృతదేహం 10 గంటలకే రామాపురం బీచ్ తీరానికి కొట్టుకొచ్చింది. గమనించిన స్థానికులు ఈపురుపాలెం పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ డాక్టర్ ప్రేమ్‌కాజల్, సీఐ భక్తవత్సలరెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అత్తింటి వేధింపులే కారణమా?
మృతురాలి తల్లిదండ్రులు మాత్రం తమ కుమారై ఆత్మహత్యకు ఆమె భర్త పవన్‌కుమార్, అతని తల్లిదండ్రులు, ఆడపడుచే కారణమని, వారంతా కలిసి తమ కుమారైను నిత్యం హింసించే వారని, వారి వరకట్న వేధింపులు తాళలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపిస్తూ ఈపురుపాలెం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపా రు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.