భర్త మద్యానికి బానిసవడంతో మనస్తాపానికి గురైన మహిళ కొడుకుతో సహా ఆత్మహత్య చేసుకుంది.
కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య
Jul 25 2016 3:24 PM | Updated on Sep 4 2017 6:14 AM
పుంగనూరు: భర్త మద్యానికి బానిసవడంతో మనస్తాపానికి గురైన మహిళ కొడుకుతో సహా ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులో సోమవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న పార్వతమ్మ(26) భర్త చెడు వ్యసనాలకు బానిసై ఇంట్లో ఉన్న వస్తువులను అమ్మేస్తుండటంతో.. మనస్తాపానికి గురై మూడేళ్ల కొడుకు పవన్‌కుమార్‌తో కలిసి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పవన్ కుమార్ మృతదేహం లభించగా, పార్వతమ్మ మృతదేహం కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Advertisement
Advertisement