మహబూబ్ నగర్ జిల్లా: తల్లి మందలించిదని ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భూత్పూర్ మున్సిపాలిటీలోని వాల్యాతండాలో శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ చంద్రశేఖర్, తండావాసుల కథనం ప్రకారం.. వాల్యాతండాకు చెందిన డేగావత్ వసురాం, భార్య శారద, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లతో కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో నివాసం ఉంటున్నారు. కొన్నిరోజులుగా డేగావత్‌పూజ(రెండో కుమార్తె) భోజనం సరిగ్గా చేయడంలేదని తల్లి మందిలించింది. శనివారం ఉదయం 9గంటల ప్రాంతంలో భూత్పూర్ మున్సిపాలిటీలోని వాల్యాతండాకు (నాయనమ్మ) వద్దకు వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి వచ్చింది.
శివరాంపల్లి నుంచి వాహనంలో వచ్చి వాల్యాతండా స్టేజీ వద్ద దిగి తండా సమీపంలోనే వ్యవసాయ పొలం వద్ద ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కొద్ది దూరంలో ఉన్న వ్యవసాయ పొలం వద్ద తండాకు చెందినవారు వ్యవసాయ పనులు చేస్తుండగా ఆకస్మాత్తుగా పొగ రావడం గమనించిన వెళ్లి చూడగా యువతి మంటల్లో ఉన్న విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 108వాహనంలో జనరల్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. పూజ డీఆర్‌డీఏలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తుందని, పూజ తండ్రి వసురాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


