జాతీయ సహజ వ్యవసాయ గ్రామంగా నందివడ్డెమాన్‌ | - | Sakshi
Sakshi News home page

జాతీయ సహజ వ్యవసాయ గ్రామంగా నందివడ్డెమాన్‌

Feb 27 2026 8:06 AM | Updated on Feb 27 2026 8:06 AM

జాతీయ సహజ వ్యవసాయ గ్రామంగా నందివడ్డెమాన్‌

జాతీయ సహజ వ్యవసాయ గ్రామంగా నందివడ్డెమాన్‌

బిజినేపల్లి: సహజ వ్యవసాయంపై జాతీయ పథకం కింద మండలంలోని నందివడ్డెమాన్‌ను ఎంపిక చేశారని, ఈ గ్రామంలో ఎంపిక చేసిన రైతుల చేత సహజ వ్యవసాయం సాగు చేయబడుతుందని ఏడీఏ పూర్ణచంద్రారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని నందివడ్డెమాన్‌లో సహజ వ్యవసాయంపై ఎంపిక చేసిన రైతులకు వ్యవసాయశాఖ అధికారులు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జాతీయ పథకం కింద ఎంపికై న ఈ గ్రామంలో పలు రకాల ఆహార పంటలను సహజ పద్ధతిలో పండిస్తారని అధికారులు తెలిపారు. పాలెం కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్త డా.ఓ.శైల ఆధ్వర్యంలో రైతులు సహజ పద్ధతిలో సాగుచేసే ఆహార పంటలు, పంటలో చీడ పీడీల నివారణకు తయారు చేసుకునే ఏరువులు, కషాయాల గురించి అవగాహన కల్పించారు. వాణిజ్య ఆహార పంటలైన వేరుశనగ, పొద్దు తిరుగుడు, మొక్కజొన్నతోపాటు వివిధ రకాల చిరుధాన్యాల పంటలు సహజంగా పండించాలని సూచించారు. సహజ పద్ధతిలో ఆహార పంటలను పండించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని ఏడీఏ పూర్ణచంద్రారెడ్డి తెలిపారు. భవిష్యత్‌లో సహజ వ్యవసాయంలో పండించిన పంటలకు అధిక డిమాండ్‌, ధరలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో ఏవో కమల్‌కుమార్‌, ఏఈవో మధు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement