విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

Feb 27 2026 8:06 AM | Updated on Feb 27 2026 8:06 AM

విద్య

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

నవాబుపేట: పొలం దగ్గర ప్రమాదవశాత్తు జరిగిన విద్యుత్‌ ఘాతంలో గిరిజన రైతు మృతి చెందాడు. ఈ ఘటన వివరాలిలా.. మండలంలోని చిన్నమేగ్యతండాకు చెందిన మెగావత్‌ వెంకటేశ్‌(47) బుధవారం పల్లిచేనుకు నీరు పెట్టడానికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి పొలానికి బయలుదేరాడు. పొలం చెంత స్టార్టర్‌ డబ్బా ప్రాంతంలో విద్యుత్‌ సర్వీస్‌వైరు తెగిపోయి వెళాడుతుండగా.. దాన్ని గమనించకుండా నేరుగా స్టార్టర్‌ దగ్గరకు వెళ్లడంతో షాక్‌ తగిలి అక్కడిక్కడే మృతిచెందాడు. తన భర్త రాత్రివరకు ఇంటికి రాకపోవడంతో మృతుడి భార్య తన కుటుంబ సభ్యులతో కలిసి వెతుకుతుండగా పొలంలో బోరుకు సమీపంలో మృతిచెంది కనిపించాడు. అక్కడికెళ్లి పరిశీలించగా చేయికి విద్యుత్‌ వైరు తగిలిన గాయాలు ఉండటంతో షాక్‌తో మృతిచెందినట్లు తెలిసింది. గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మృతుడి భార్య లక్ష్మి తెలిపారు. ఈ విషయంలో కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ విక్రమ్‌ తెలిపారు.

ట్రాక్టర్‌, బైక్‌ ఢీ.. ఇద్దరు మృతి

కొల్లాపూర్‌ రూరల్‌: ట్రాక్టర్‌, బైక్‌ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన గురువారం మండలంలోని సింగోటం గ్రామ సమీపంలో లక్ష్మీదేవమ్మ గుట్ట వద్ద జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. మండలంలోని చుకాయపల్లి గ్రామానికి చెందిన బింగి ఉషన్న(50), కొల్లాపూర్‌ పట్టణానికి చెందిన సమ్మత్‌(50) బైకుపై సింగోటం నుంచి వస్తున్నారు. ఈ క్రమంలో కొల్లాపూర్‌ నుంచి పాన్‌గల్‌ మండలం అన్నారం గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ జొన్నసొప్ప వేసుకొని వస్తుండగా సింగోటం వద్ద ప్రధాన రహదారిపై ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో బైకుపై ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

జెర్రిపోతు పట్టివేత

కొత్తకోట రూరల్‌: మండల కేంద్రంలోని బీపీఆర్‌ గార్డెన్‌ సమీపంలో నాగరాజు సాగర్‌ అనే వ్యక్తి కాంపౌండ్‌లో ఉన్న వాష్‌ బేసిన్‌ ప్లాస్టిక్‌ పైపులో జెర్రిపోతు కనిపించడంతో యజమాని స్నేక్‌ క్యాచర్‌, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న హోంగార్డు కృష్ణసాగర్‌కు సమాచారం అందించారు. దీంతో కృష్ణసాగర్‌ వెంటనే అక్కడికి చేరుకుని ఎంతో కష్టం మీద జెర్రిపోతు పామును పట్టుకున్నాడు. పట్టుకున్న జెర్రిపోతు ఆరు అడుగుల పొడవు ఉంటుందని, పాములను చంపవద్దని పాములు కనిపిస్తే తనకు సమాచారం ఇవ్వాలని కృష్ణసాగర్‌ సూచించారు.

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి 
1
1/1

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement