Telangana Crime News: ఒంటరితనం భరించలేక.. యువతి తీవ్ర నిర్ణయం..!
Sakshi News home page

ఒంటరితనం భరించలేక.. యువతి తీవ్ర నిర్ణయం..!

Sep 10 2023 5:04 AM | Updated on Sep 10 2023 12:55 PM

- - Sakshi

సంగారెడ్డి: ఒంటరితనం భరించలేక యువతి తనువు చాలించిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెంకు చెందిన నూనె ధనూజ(21) రెండు నెలల క్రితం బ్రాంచ్‌ పోస్టు ఉమెన్‌గా ఉద్యోగం సాధించింది. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా చందుర్తి మండలం మర్రిగడ్డకు వచ్చింది.

రెండు నెలలుగా మర్రిగడ్డలో అద్దె ఇంట్లో ఉంటూ విధులు నిర్వర్తిస్తుంది. ఈక్రమంలో వరుసకు బావ అయిన రాకేశ్‌ను ప్రేమిస్తుంది. ఒంటరితనంతో బాధపడుతున్నానని రాకేశ్‌తో చెప్పుకోగా.. ఉద్యోగానికి రాజీనామా చేసి రమ్మనడంతో గత నెల 31న రాజీనామా పత్రాన్ని సమర్పించింది. రెండు రోజులగా స్థానికంగా లేని ధనూజ శుక్రవారం మర్రిగడ్డలో అద్దెకుంటున్న ఇంటికి సామగ్రి తీసుకెళ్లేందుకు వచ్చింది.

అదే రోజు రాత్రి 11.30 గంటల సమయంలో ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతూనే తల తిప్పుతుందని చెప్పి ఫోన్‌ కట్‌ చేసింది. వెంటనే రాకేశ్‌ మర్రిగడ్డలోని తెలిసిన వ్యక్తులకు ఫోన్‌ చేసినా వారు స్పందించలేదు. శనివారం తెల్లవారుజామున మర్రిగడ్డకు చెందిన మరొక వ్యక్తికి రాకేశ్‌ ఫోన్‌ చేసి ధనూజ ఇంటికెళ్లి చూసి రావాలని కోరాడు. సదరు వ్యక్తి వెళ్లి పిలువగా గదిలో నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇంటి పైకప్పు ఎక్కి చూడగా ఉరివేసుకొని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి నూనె మమత ప్రేమ వ్యవహారమే తన కూతురు మరణానికి కారణమని ఫిర్యాదు చేసినట్లు ఎస్సై అశోక్‌ తెలిపారు.

ముఖ్య గమని​క:
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement