బీఆర్‌ఎస్ బీజేపీ ఒక్కటే
జహీరాబాద్: రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీలు ఒక్కటేనని జహీరాబాద్ పార్లమెంట్ మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి, మంత్రి అజహరుద్దీన్ పేర్కొన్నారు. జహీరాబాద్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఆయన శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడుతూ..అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడం ఖాయమన్నారు. ప్రజలు బీఆర్‌ఎస్‌ను విశ్వసించడం లేదని ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని చెప్పారు. ప్రజలు బీఆర్‌ఎస్, బీజేపీల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. అంతకుముందు పట్టణంలోని మజీద్‌లను ఆయన సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీలతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీ సురేశ్ షెట్కార్, మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.గిరిధర్‌రెడ్డి, ట్రెమీస్ చైర్మన్ ఫయూమ్, ఐడీసీ చైర్మన్ నిర్మలారెడ్డి, ఐడీసీ మాజీ చైర్మన్ ఎం.డి.తన్వీర్, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఎస్.ఉజ్వల్‌రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
రోడ్‌షోలో మంత్రి అజహరుద్దీన్


