ఓపెన్‌ వర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా | - | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ వర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా

Feb 7 2026 3:04 PM | Updated on Feb 7 2026 3:04 PM

ఓపెన్‌ వర్సిటీ  డిగ్రీ పరీక్షలు వాయిదా

ఓపెన్‌ వర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా

జోగిపేట(అందోల్‌): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ డిగ్రీకి సంబంధించిన సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.రమేశ్‌, కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ జి.పండరీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు ఈనెల 17 నుంచి మార్చి 10వ తేది వరకు జరుగుతాయని పేర్కొన్నారు. 17వ తేదీన మూడవ సెమిస్టర్‌, 24న రెండవ సెమిస్టర్‌, మార్చి 4న మొదటి సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యార్థులు మారిన పరీక్షల తేదీలను గమనించాలని కోరారు.

గురుకులాల్లో నాణ్యమైన విద్య

జహీరాబాద్‌ టౌన్‌: తెలంగాణ మైనార్టీ రెసిడెన్సియల్‌ పాఠశాల, కళాశాలల్లో నాణ్యమైన విద్యా బోధన జరుగుతుందని ఉమ్మడి మెదక్‌ జిల్లాల విజిలెన్స్‌ ఆఫీసర్లు గౌస్‌పాష, జగదీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని శేఖాపూర్‌ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ప్రవేశాల కోసం పచ్రార కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. గురుకులాల్లో 5 నుంచి ఇంటర్‌ వరకు తరగతుల నిర్వహణ కొనసాగుతుందన్నారు. నాణ్యమైన విద్యా బోధనతోపాటు పోటీపరీక్షల కోచింగ్‌, ఆటల పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ పిల్లలను రెసిడెన్షియల్‌ పాఠశాలలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో గురుకులాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.కె.జమీల్‌, షహనాజ్‌ బేగం, రుబీనబేగం సర్పంచ్‌ చస్మోద్దీన్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement