బీజేపీతోనే అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

బీజేపీతోనే అభివృద్ధి

Feb 7 2026 3:04 PM | Updated on Feb 7 2026 3:04 PM

బీజేపీతోనే అభివృద్ధి

బీజేపీతోనే అభివృద్ధి

ఎంపీ రఘునందన్‌రావు

సంగారెడ్డి: సంగారెడ్డి అభివృద్ధి చెందాలంటే ప్రస్తుతం బీజేపీ గెలవాలని ఆ పార్టీ అభ్యర్థే చైర్మన్‌ కావాలని ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలో మూడు చోట్ల కార్నర్‌ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో సంగారెడ్డి ప్రజలు బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి చైర్మన్‌ పదవి కట్టబెట్టాలని కోరారు. సంగారెడ్డి వెనుకబాటుకు జగ్గారెడ్డి, చింతా ప్రభాకర్‌ కారణమన్నారు. పక్క వ్యక్తి జేబులో నుంచి డబ్బులు తీసుకుని తానే సాయం చేసినట్లుగా జగ్గారెడ్డి మీడియాలో రాయించుకుంటారని ఎద్దేవా చేశారు. దసరా పండుగ వస్తే సంగారెడ్డికి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చినట్లుగా అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ రాదన్నారు. కేంద్ర ప్రభుత్వం సంగారెడ్డికి అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ మంజూరు చేస్తే హరీశ్‌రావు తన మామ మెప్పు కోసం గజ్వేల్‌ తీసుకువెళ్లారని తెలిపారు.సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ చేతకానితనంతో సంగారెడ్డి ప్రజలు నష్టపోతున్నారన్నారని విమర్శించారు. మున్సిపల్‌ ఎలక్షన్లో ప్రజలందరూ ఆచితూచి మంచి మనసుతో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రార్థించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్‌ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement