రూ.5 వేల కోట్లు కేటాయించాలి | - | Sakshi
Sakshi News home page

రూ.5 వేల కోట్లు కేటాయించాలి

Feb 7 2026 3:04 PM | Updated on Feb 7 2026 3:04 PM

రూ.5 వేల కోట్లు కేటాయించాలి

రూ.5 వేల కోట్లు కేటాయించాలి

సంగారెడ్డి టౌన్‌: తెలంగాణలో ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో గీత కార్మికుల సంక్షేమానికి రూ.5 వేల కోట్లు కేటాయించాలని కల్లుగీత కార్మిక సంఘం డిమాండ్‌ చేసింది. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్‌లో శుక్రవారం నిర్వహించిన కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి రమేశ్‌గౌడ్‌ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈనెల 17న ఇందిరాపార్క్‌ వద్ద చేపట్టనున్న నిరాహారదీక్షను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జంగన్న గౌడ్‌, జిల్లా కార్యదర్శి ప్రసాద్‌గౌడ్‌ జిల్లా నాయకులు, ప్రతాప్‌గౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, యాదగౌడ్‌, రవి, హరీశ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

కల్లుగీత కార్మిక సంఘం డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement