
ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చేసుకుంది.
హైదరాబాద్: ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మూడుచింతలపల్లి మండలం, కొల్తూర్ గ్రామానికి చెందిన ప్రవళిక (25) శామీర్‌పేట్ మండలం, లాల్‌గడీ మలక్‌పేట్‌కు చెందిన రమేశ్ ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
వారికి ఇద్దరు సంతనం కలిగారు. కాగా ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రవళిక ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న జీనోమ్ వ్యాలీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైయిందని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని సీఐ రాజ్‌గోపాల్‌రెడ్డి తెలిపారు.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com