Hyd: ప్రతీరోజు ఇంటింటికి చెత్త సేకరణ జరగాల్సిందే: సీఎం రేవంత్‌ | Daily Door to Door Garbage Collection Must Be Ensured CM Revanth | Sakshi
Sakshi News home page

Hyd: ప్రతీరోజు ఇంటింటికి చెత్త సేకరణ జరగాల్సిందే: సీఎం రేవంత్‌

Mar 7 2026 9:20 PM | Updated on Mar 7 2026 9:51 PM

Daily Door to Door Garbage Collection Must Be Ensured CM Revanth

హైదరాబాద్: నగరాన్ని క్లీన్‌సిటీగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ రోజు శనివారం(మార్చి 7వ తేదీ) మున్సిపల్‌ కమిషనర్లతో జరిగిన సమీక్షలో సీఎం రేవంత్‌.. ఈ మేరకు పలు సూచనలు చేశారు.  ‘నగరంలో ప్రతీరోజు ఇంటింటికి చెత్త సేకరణ జరగాల్సిందే. కార్పొరేషన్స్‌ కోర్, అర్బన్ రీజియన్ పరిధిలో ప్రతీరోజు చెత్త సేకరణ జరిగేలా చర్యలు చేపట్టాలి. చెత్త సేకరణకు సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా ఇప్పటి నుంచే ప్రోత్సహించాలి. ఒక్కో వాహనానికి ఒక్కో ఏరియా చొప్పున కేటాయించి నిరంతరం పర్యవేక్షించాలి. 

నగరం పరిధి విస్తరించిన నేపథ్యంలో ఇప్పటికే కొత్తగా గుర్తించిన డంప్ యార్డులను వీలైనంత త్వరగా సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకురావాలి. కార్పోరేషన్ల వారీగా దగ్గరలోని డంపింగ్ యార్డులకు చెత్తను తరలించేలా చర్యలు తీసుకోవాలి. ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. క్యూర్ పరిధిలోని ట్రై మున్సిపల్ కార్పోరేషన్లలో నిర్మాణ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్మాణ వ్యర్థాల తరలింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. అపరిశుభ్రత లేకుండా చూసుకోవడంతో పాటు దోమల నివారణకు చర్యలు చేపట్టాలి. సీజనల్ వ్యాధుల విషయంలో నగరవాసులకు సరైన వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలి’ అని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement