ప్రియుడు లేని లోకంలో ఉండలేనని.. | young woman commit to suicide | Sakshi
Sakshi News home page

ప్రియుడు లేని లోకంలో ఉండలేనని..

Jan 2 2018 8:21 AM | Updated on Jul 12 2019 3:07 PM

young woman commit to suicide - Sakshi

మంగళూరు (సాక్షి, బెంగళూరు): మనసంతా అతని తలపులే నిండిపోయాయి. కానీ అతను అర్ధంతరంగా తనువు చాలించాడు, అతని తలపుల నుండి బయటికి రాలేక తనూ ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయింది. ఈ ఘటన మంగళూరులోని ఉల్లాళ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు....మంగళూరులోని ఉల్లాళ ప్రాంతానికి చెందిన రుబేనా(17), అఫ్రాజ్‌(18) స్థానికంగా కాలేజీలో కలిసి చదువుకుంటున్నారు. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే గత ఏడాది నవంబర్‌ 24న అఫ్రాజ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు, అప్పటి నుంచి ఆమె అతన్ని తలచుకుంటూ మథనపడుతూనే ఉంది. ఈ ఆవేదనతో రుబేనా సోమవారం సాయంత్రం తన ఇంట్లో ఉరి వేసుకొని ప్రాణాలు విడిచింది. 

Advertisement
 
Advertisement
Advertisement