మాజీ ప్రియుడు భర్తకు ఫొటోలు పంపడంతో! | Woman kills self over marital issues, her ex lover held | Sakshi
Sakshi News home page

మాజీ ప్రియుడు భర్తకు ఫొటోలు పంపడంతో!

Jun 22 2016 7:40 PM | Updated on Sep 4 2017 3:08 AM

మాజీ ప్రియుడు భర్తకు ఫొటోలు పంపడంతో!

మాజీ ప్రియుడు భర్తకు ఫొటోలు పంపడంతో!

తనతో దిగిన ఫొటోలను ప్రియుడు భర్తకు పంపడంతో ఓ 26 ఏళ్ల నవవధువు అఘాయిత్యానికి ఒడిగట్టింది. విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది.

థానె (మహారాష్ట్ర): తనతో దిగిన ఫొటోలను ప్రియుడు భర్తకు పంపడంతో ఓ 26 ఏళ్ల నవవధువు అఘాయిత్యానికి ఒడిగట్టింది. విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. థానె జిల్లాలోని ఖినావాలి ప్రాంతంలో ఆదివారం (19న) ఈ ఘటన జరిగింది. 26 ఏళ్ల వృశాలి భాగ్ రావుకు ఇటీవల పెళ్లయింది. ఈ నేపథ్యంలో వృశాలి ప్రియుడు రజాక్ పీర్ మహమ్మద్ తనతో ఆమె దిగిన ఫొటోలను భర్తకు పంపించాడు. ఈ ఫొటోలు చూసి ఆగ్రహించిన భర్త వృశాలితో గొడవపడ్డాడు. వృశాలిని షాహాపూర్ తాలుకాలోని ఆమె తల్లి ఇంటి వద్ద వదిలేశాడు. దీంతో మనస్తాపం చెందిన వృశాలి విషం తాగి తనువు చాలించింది.

వృశాలి నిందితుడు రజాక్ తో రెండేళ్లపాటు ప్రేమవ్యవహారాన్ని నడిపింది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ 29న ఆమెకు ముర్ బాద్ కు చెందిన చేతన్ తో పెళ్లయింది. వీరి పెళ్లిని కంటగింపుగా భావించిన రజాక్ తాను వృశాలితో సాన్నిహిత్యంగా ఉన్న ఫొటోలను భర్త చేతన్ వాట్సాప్ కు పంపించాడని, ఈ క్రమంలో జరిగిన గొడవలతో కలత చెందిన వృశాలి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసి.. నిందితుడు రజాక్ ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement