అవమానాన్ని తట్టుకోలేక ఉరేసుకున్నాడు..! | Student From Thane Ends His Life After Beaten Up In Train | Sakshi
Sakshi News home page

అవమానాన్ని తట్టుకోలేక ఉరేసుకున్నాడు..!

Nov 21 2025 4:44 PM | Updated on Nov 21 2025 5:31 PM

Student From Thane Ends His Life After Beaten Up In Train

మనుషులు ఇలా కూడా ఉంటారా.. ఇలానే ఉంటారు  అనేది కొన్ని సందర్భాల్లో మనకు బోధపడుతూ ఉంటుంది. అవతల వ్యక్తులను బాధపెట్టి, వారు అమితానందాన్ని పొందడం కొంతమందికి అలవాటు. ఒక మనిషిని చచ్చిపోయేంతగా ప్రేరేపించడం అంటే అది మన నైతిక విలువను కోల్పోవడమే. అది ఎంతటి వివాదామైన కావొచ్చు.. మనిషి ఊపిరి తీసుకునేలా ప్రేరేపించడం విలువలు కోల్పోతున్న సమాజానికి నిదర్శనం.

మనిషికి ఒక భాష రాకపోతే చచ్చేలా  కొట్టి,.. చివరకు చచ్చిపోయేలా ప్రేరేపించిన ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకుంది.  హిందీ వర్సెస్‌ మరాఠీ వివాదం ఎంతో కెరీర్‌ ఉన్న విద్యార్థి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది. 

అర్నవ్‌ ఖారే.. వయసు 19 ఏళ్లు. థానేలో ఉంటాడు.  ఫస్ట్‌ ఇయర్‌ డిగ్రీ సైన్స్‌ స్టూడెంట్‌. ప్రతీరోజూ ముంబైలోని ములంద్‌ ప్రాంతానికి కాలేజ్‌కి వెళ్తూ వస్తున్నాడు. కాలేజ్‌కి వెళ్తున్నాడు.. కానీ క్లాస్‌లకు రెగ్యులర్‌గా హాజరు కావడం లేదు. ఏదో తెలియని అభద్రతా భావం అతనిలో . అందుకే కాలేజ్‌లకు డుమ్మూ కొడుతూ వస్తున్నాడు. దీనికి కారణం అవమానం అనే ‘మహమ్మారి. కాలేజ్‌తో పాటు, తాను రోజూ ప్రయాణించే ట్రైన్‌లో సైతం అవమానాన్ని ఎదుర్కొంటూనే ఉన్నాడు. 

తనకు మరాఠీ రాదనే తోటి, సాటి వారు రోజూ ఎగతాళి చేయడం, టార్చర్‌ పెట్టడం భరించలేకపోతున్నాడు. ఒక రోజైతే ఆ విద్యార్థిని ట్రైన్‌లో కొట్టారు,. ‘వీడికి మరాఠీ రాదు’ అంటూ చివరికి చేయి కూడా చేసుకున్నారు పలువురు ప్రబుద్ధులు. దాంతో ములంద్‌ వెళ్లాల్సిన ఆ యువకుడు నెక్స్ట్‌ స్టేషన్‌లో దిగిపోయాడు. అదే విషయాన్ని తండ్రికి ఫోన్‌లో చెప్పాడు. ఆపై ఇంటికి వచ్చేసి ఉరేసుకున్నాడు. 

తండ్రి తన డ్యూటీ ముగించకుని వచ్చేసరికి విగతా జీవిలా  ఇంట్లో ఉరేసుకుని కనిపించాడు. ఇది తండ్రి జిజేంద్ర ఖైరేకు మనోవేదనను తీసుకొచ్చింది. భాష మాట్లాడలేదని తన కుమారుడిని కొట్టారని, భాష రాకపోవడంతో కాలేజ్‌లోనే కాకుండా ట్రైన్‌లోనే అవమానిస్తూ వచ్చారన్నాడు. ఇదే విషయాన్ని తనకు ఫోన్‌ చేసి చెప్పాడని, ఇంటికొచ్చి ఇలా ఆత్మహత్య చేసుకున్నాడని రోదిస్తున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఎవర్నీ అరెస్ట్‌ చేయలేదు. 

మహారాష్ట్రలో హిందీ–మరాఠీ భాషా వివాదం కొత్తది కాదు. ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్య. అయితే, 2025 ఏప్రిల్ నుండి ప్రభుత్వం పాఠశాలల్లో మరాఠీని రాష్ట్ర భాషగా తప్పనిసరి చేసి, హిందీని మూడో భాషగా పెట్టిన నిర్ణయం తర్వాత వివాదం మళ్లీ తీవ్రరూపం దాల్చింది

మరాఠీ వర్సెస్‌ హిందీ వివాదంపై తాజాగా చోటు చేసుకున్న హింసాత్మక సంఘటన ఇది. గత నెలలో విమానంలో ముంబైకి వెళ్తున్న  ఒక ప్రయాణికుడు.. మరొక ప్రయాణికుడ్ని మరాఠీలో మాట్లాడమని బలవంతం చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement