రైలు ఇంజన్ టాప్పైకి మహిళ ఎక్కి.. | Woman commits suicide by touching electric wire atop train | Sakshi
Sakshi News home page

రైలు ఇంజన్ టాప్పైకి మహిళ ఎక్కి..

Jun 13 2016 3:57 PM | Updated on Sep 4 2017 2:23 AM

రైలు ఇంజన్ టాప్పైకి మహిళ ఎక్కి..

రైలు ఇంజన్ టాప్పైకి మహిళ ఎక్కి..

మధ్యప్రదేశ్లో ఓ గుర్తు తెలియని మహిళ రైలు ఇంజిన్పైకి ఎక్కి హై టెన్షన్ వైర్ పట్టుకుని ఆత్మహత్య చేసుకుంది.

హొషంగాబాద్: మధ్యప్రదేశ్లో ఓ గుర్తు తెలియని మహిళ రైలు ఇంజిన్పైకి ఎక్కి హై టెన్షన్ వైర్ పట్టుకుని ఆత్మహత్య చేసుకుంది. తీవ్రగాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మరణించింది.

సోమవారం హొషంగాబాద్ సమీపంలో ఆ మహిళ రైలు పట్టాలపై నడుచుకుంటూ అటుగా వెళ్తున్న గూడ్సు రైలుకు అడ్డంగా వెళ్లింది. గూడ్సు రైలు డ్రైవర్ ఆమెను గమనించి బ్రేకులు వేసి ఆపేశాడు. రైలు ఆగగానే ఆమె ఇంజిన్ టాప్పైకి ఎక్కి చేతులతో కరెంట్ వైరును పట్టుకుంది. మృతురాలి వివరాలు, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అన్న విషయాలను తెలుసుకోవాల్సి ఉందని రైల్వే పోలీసులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement