రైలు ఇంజన్ టాప్‌పైకి మహిళ ఎక్కి..
హొషంగాబాద్: మధ్యప్రదేశ్‌లో ఓ గుర్తు తెలియని మహిళ రైలు ఇంజిన్‌పైకి ఎక్కి హై టెన్షన్ వైర్ పట్టుకుని ఆత్మహత్య చేసుకుంది. తీవ్రగాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మరణించింది.
సోమవారం హొషంగాబాద్ సమీపంలో ఆ మహిళ రైలు పట్టాలపై నడుచుకుంటూ అటుగా వెళ్తున్న గూడ్సు రైలుకు అడ్డంగా వెళ్లింది. గూడ్సు రైలు డ్రైవర్ ఆమెను గమనించి బ్రేకులు వేసి ఆపేశాడు. రైలు ఆగగానే ఆమె ఇంజిన్ టాప్‌పైకి ఎక్కి చేతులతో కరెంట్ వైరును పట్టుకుంది. మృతురాలి వివరాలు, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అన్న విషయాలను తెలుసుకోవాల్సి ఉందని రైల్వే పోలీసులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.