‘హెచ్‌ఐవీ’ ఎక్కించిన ఘటనలో యువతి ఆత్మహత్య | Hyderabad Victim Commits Suicide after HIV infected Blood Transfusion | Sakshi
Sakshi News home page

‘హెచ్‌ఐవీ’ ఎక్కించిన ఘటనలో యువతి ఆత్మహత్య

Apr 11 2026 5:27 AM | Updated on Apr 11 2026 11:55 AM

Hyderabad Victim Commits Suicide after HIV infected Blood Transfusion

గత నెలలో జరిగిన ఉదంతం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నాటి నుంచి మనోవేదన

ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణం

పోచారం: హెచ్‌ఐవీ సోకిన తనను పెళ్లి చేసుకోవడా నికి నిరాకరించిందన్న కోపంతో ప్రియురాలికి గత నెల లో ప్రియుడు తన రక్తంతో ఇంజెక్షన్‌ చేసిన ఘట నలో బాధితురాలు శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. పోచా రం ఐటీ కారిడార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గత నెల 11న చోటుచేసుకున్న ఘటనలో పోలీసులు గత నెలలోనే నిందితుడు మనోహర్‌ను అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు పంపగా, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితురాలు రమణి ఆ తర్వాత అన్నోజి గూడలోని సొంతింటికి తిరిగి వచ్చింది.

అయితే ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో బాధి తురాలు తీవ్ర మనోవేదనకు గురైంది. తల్లిదండ్రులు గతంలో వేరే వ్యక్తితో ఆమెకు వివాహం కుదర్చగా ఈ ఘటన గురించి తెలుసుకున్న వరుడు వివాహానికి నిరా కరించాడు. దీంతో మరింత మనస్తాపానికి గురైన రమణి శుక్రవారం తన ఇంటి సమీపంలోని నానమ్మ ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అంతకు ముందు సెల్ఫీ వీడియో తీసి సూసైడ్‌ నోట్‌ రాసింది. ‘అమ్మా, నాన్నా నన్ను క్షమించండి. నాకు బతకాలని లేదు.

మరో జన్మంటూ ఉంటే మీ కడుపులో పుడతా. అమ్మ, నాన్నలను చెల్లి, తమ్ముడు మంచిగా చూసు కోవాలి’ అని కోరింది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమా చారం అందించడంతో యువతిని ఘట్‌కేసర్‌ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతురాలికి హెచ్‌ఐవీ వైరస్‌ సోకినట్లు తెలిసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement