తోటి విద్యార్థి వేధింపులు.. బాలిక ఆత్మహత్య | Minor Girl Shocking Incident At hayatnagar | Sakshi
Sakshi News home page

తోటి విద్యార్థి వేధింపులు.. బాలిక ఆత్మహత్య

Apr 11 2026 5:18 AM | Updated on Apr 11 2026 5:18 AM

Minor Girl Shocking Incident At hayatnagar

స్థానిక రాజకీయ నేత కుమారుడిపై ఆరోపణలు

హయత్‌నగర్‌: సహచర విద్యార్థి సోషల్‌ మీడియాలో వేధిస్తుండటంతో మనస్తాపానికి గురైన ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం నాగార్జునసాగర్‌ హిల్‌ కాలనీకి చెందిన నమలితోక కేశవ లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుంట్లూర్‌లో ఉంటున్నాడు. ఆయనకు కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు (15) స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. స్థానిక కాంగ్రెస్‌ నేత కొడుకు (15) కూడా అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు.

ఈ క్రమంలో కేశవ కూతురు గురువారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లాడు. దీంతో పోలీసులు కేశవకు ఫోన్‌ చేసి మృతదేహాన్ని తిరిగి హైదరాబాద్‌ తెప్పించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు ఆరా తీయగా స్థానిక రాజకీయ నేత కొడుకు తరచూ సోషల్‌ మీడియాలో బాలికను వేధించడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement