రష్మిక ఊర్లో రిసెప్షన్‌.. మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చిన తండ్రి | Rashmika Mandanna Father Madan Gift Bungalow to Daughter | Sakshi
Sakshi News home page

అత్తారింటికి రష్మిక.. విలువైన కానుక ఇచ్చిన తండ్రి

Apr 8 2026 12:29 PM | Updated on Apr 8 2026 12:55 PM

Rashmika Mandanna Father Madan Gift Bungalow to Daughter

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా.. ఇద్దరూ స్టార్‌ సెలబ్రిటీలే.. కానీ ఇద్దరి మధ్య ఎక్కడా కించిత్తు గర్వం కనిపించదు. ప్రేమ, అనురాగానికి తప్ప మరోదానికి చోటు లేదు అన్నట్లుగానే కనిపిస్తారు. వారి పెళ్లి వేడుకలు కూడా అలాగే చేసుకున్నారు. కేవలం వారికి మాత్రమే గుర్తుండిపోయేలా కాకుండా నలుగురూ గుర్తుపెట్టుకునేలా, నాలుగు కాలాలపాటు మాట్లాడుకునేలా సెలబ్రేషన్స్‌ జరిపారు. 

కొడవ పద్ధతిలో రిసెప్షన్‌
అభిమానులకు స్వీట్లు పంచడం, ఊర్లోని మెరిట్‌ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ప్రకటించడం, ఊరందరికీ భోజనాలు పెట్టడం.. ఇలా వారు చేసిన ప్రతీ పని మెచ్చుకోదగినదే! అయితే రష్మికను తెలుగింటి కోడలిగా పరిచయం చేస్తూ విజయ్‌ ఇక్కడ రిసెప్షన్‌ ఏర్పాటు చేశాడు. అచ్చం అలాగే రష్‌ పేరెంట్స్‌ కూడా బంధువులకు, స్థానికులకు విజయ్‌ను అల్లుడిగా పరిచయం చేస్తూ తమ సొంతూరైన విరాజ్‌పేటలో రిసెప్షన్‌ నిర్వహించారు. 

మర్చిపోలేని కానుక
కొడవ సాంప్రదాయం ప్రకారమే ఈ వేడుక జరిపారు. ఈ సందర్భంగా రష్మిక తండ్రి మదన్‌ మందన్నా కూతురికి విలువైన కానుక ఇచ్చాడు. పెళ్లయ్యాక అత్తారింటికి సాగనంపిన కూతురి కోసం కలకాలం గుర్తుండిపోయే బహుమతిచ్చాడు. విరాజ్‌పేట సమీపంలో సెరెనిటీ పేరుతో ఉన్న ఓ బంగ్లాను కూతురికి రాసిచ్చాడు. తండ్రిచ్చిన గిఫ్ట్‌తో రష్మిక భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది.

సినిమా
కాగా రష్మిక మందన్నా- విజయ్‌ దేవరకొండ ఈ ఏడాది ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరు గీతగోవిందం, డియర్‌ కామ్రేడ్‌ చిత్రాల్లో కలిసి నటించారు. ప్రస్తుతం రణబాలి సినిమాలో జంటగా యాక్ట్‌ చేస్తున్నారు.

చదవండి: ఆగిపోయిన డ్రాగన్‌ షూటింగ్‌? స్పందించిన ప్రశాంత్‌ నీల్‌ టీమ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement