ఆగిపోయిన డ్రాగన్‌ షూటింగ్‌? స్పందించిన టీమ్‌ | #NTRNEEL Movie: Prashanth Neel Team React on Jr. NTR Look, Schedule Rumours | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ లుక్‌, షూటింగ్‌పై రూమర్స్‌.. క్లారిటీ ఇచ్చిన టీమ్‌

Apr 8 2026 9:30 AM | Updated on Apr 8 2026 9:38 AM

#NTRNEEL Movie: Prashanth Neel Team React on Jr. NTR Look, Schedule Rumours

టాలీవుడ్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫుల్‌ యాక్షన్‌ మోడ్‌లో ఉన్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డ్రాగన్‌ (ప్రచారంలో ఉన్న టైటిల్‌). కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. గత నెలలో యాక్షన్‌ సన్నివేశాలను  చిత్రీకరించారు. అయితే కొద్దిరోజులుగా తారక్‌ మేకోవర్‌ గురించి, అలాగే షెడ్యూల్‌ రద్దయిందంటూ కొన్ని రూమర్స్‌ వైరలవుతున్నాయి.

అందులో నిజం లేదు
ఈ ప్రచారంపై చిత్రయూనిట్‌ స్పందించింది. లుక్‌ గురించి కానీ, షెడ్యూల్‌ రద్దయినట్లు వస్తున్న ప్రచారంలో కానీ ఏమాత్రం నిజం లేదు. కేవలం చిన్నపాటి విరామాలతో ముందుగా ప్లాన్‌ చేసుకున్న ప్రకారమే సినిమా ముందుకు సాగుతోంది. దయచేసి ఎవరూ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేయొద్దని, నమ్మవద్దని కోరుతున్నాం అని ట్వీట్‌ చేసింది. దీంతో తారక్‌ సినిమా కొత్త షెడ్యూల్‌ క్యాన్సిల్‌ అయిందంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్‌ పడినట్లయింది.

సినిమా
సినిమా విషయానికి వస్తే.. ఇందులో కాంతార ఫేమ్‌ రుక్మిణి వసంత్‌ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ కీలక పాత్రలో కనిపించనున్నాడు. తాను ఈ సినిమాలో లేనని మలయాళ నటుడు టొవినో థామస్‌ మీడియా ముఖంగా చెప్పాడు. కానీ అతడి పాత్ర మాత్రం సినిమాలో ఉందని వినికిడి! రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్న ఈ మూవీని నందమూరి కల్యాణ్‌ రామ్‌, నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

 

 

చదవండి: భర్తకు సడన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన నయనతార

Advertisement
 
Advertisement
Advertisement