Anant Ambani Birthday Celebrations రిలయన్స్ వారసుడు, వ్యాపారవేత్త అనంత్ అంబానీ 31వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించు కున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఈ రోజు (ఏప్రిల్ 10) బర్త్‌డే జరుపుకుంటున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని వంతారా యూనివర్సిటీలో తండ్రి ముఖేష్ అంబానీ, భార్య రాధిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అంబానీ కుటుంబం ఒక వేడుకను నిర్వహిస్తే, అది చాలా ఘనంగా ఉండాల్సిందే. దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆహార పంపిణీ కార్యక్రమాలతో ఈ సందర్భాన్ని జరుపుకోగా, అనంత్ స్వయంగా భోజనాలు వడ్డించడం దగ్గర్నించి, ఈ రాజరాజేశ్వర ఆలయ పునరుద్ధరణకు మద్దతు ప్రకటించడం వంటి సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.
వంతారా యూనివర్సిటీ
అలాగే తన తన కలల ప్రాజెక్ట్ 'వంతర'కు విస్తరణగా వంతర విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయడం మరో విశేషం. తన సన్నిహిత కుటుంబ సభ్యులు , స్నేహితులతో ఈ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. అనంత్ అంబానీ తన భార్య రాధికా మర్చంట్ , తండ్రి ముఖేష్ అంబానీతో కలిసి విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?
స్పెషల్‌గా కేక్
ముఖ్యంగా ఈ వేడుకలో కేక్ అందరి దృష్టిని ఆకర్షించింది ప్రత్యేకమైన, పుస్తకం ఆకారంలో ఉన్న పుట్టినరోజు కేక్. ఇందులో అమర్చిన పేజీలపై "వన్యప్రాణులు, జ్ఞానానికి ఒక కొత్త అధ్యాయం," "వన్యప్రాణుల విద్యకు ఒక వారసత్వాన్ని ప్రారంభించడం," , "ప్రకృతి జ్ఞానాన్ని కలిసే చోట" వంటి పదబంధాలు ఉన్నాయి, ఇవి ప్రకృతి పట్ల అనంత్‌కున్న దార్శనికత , నిబద్ధతకు ప్రతిబింబంగా నిలుస్తుంది అంటున్నారు అభిమానులు.
Anant Ambani celebrating his birthday with Ranveer Singh, Mukesh Ambani and Radhika at Vantara University.❤️
The way Mukesh Ambani kissed Anant at the end… pure gold.👌🏻
And honestly Ranveer is just on another level lately, literally the main character wherever he walks in.🔥 pic.twitter.com/NNzQZjqVRj— Rohan💫 (@rohann__45) April 10, 2026
ఆన్‌లైన్ వైరల్‌గా మారిన వీడియో ప్రకారం కేక్ కట్ చేసిన తరువాత ముఖేష్ అంబానీ అనంత్‌ను ముద్దు పెట్టుకున్న తీరు మరింత హృద్యంగా నిలిచింది. ఈ వేడుకుల్లో బాలీవుడ్ సెలబ్రిటీలు పలువురు సందడి చేశారు. జాహ్నవి కపూర్, రణ్‌వీర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వీరితోపాటు వరుణ్ ధావన్, శిఖర్ పహారియా కూడా సరదాగా గడుపుతూ కనిపించారు. అలాగే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, రితేష్ దేశ్‌ముఖ్ , షెహనాజ్ గిల్ ఈ వేడుకలకు హాజరైనట్టు సమాచారం. థ
ఇదీ చదవండి: నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్ చేస్తే!


