నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్‌ చేస్తే! | Madhya Pradesh Woman Plots Murder Of Husband With Lover | Sakshi
Sakshi News home page

నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్‌ చేస్తే!

Apr 10 2026 1:02 PM | Updated on Apr 10 2026 1:18 PM

Madhya Pradesh Woman Plots Murder Of Husband With Lover

క్రైమ్ థ్రిల్లర్‌లా, ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేయించిన సంఘటన కలకలం రేపింది. అంతేకాదు ఏమీ తెలియనట్టు నేరాన్ని దోపిడీలా చిత్రీకరించడానికి  కపట నాటకమాడింది. అందర్నీ నమ్మించాలని మొసలి కన్నీళ్లు కార్చింది. చివరికి పోలీసులు విచారణలో ఆమె దారుణం వెలుగులోకి వచ్చింది.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలోని గొండికోట చరణ్ గ్రామంలో ఏప్రిల్ 7వ తేదీ రాత్రి  హత్య జరిగింది . సుగంధ ద్రవ్యాల వ్యాపారి  28 ఏళ్ల పురోహిత్ దేవకృష్ణ, తన ఇంట్లో హత్యకు గురైనాడు. అతని శరీరంపై పదునైన ఆయుధంతో దారుణంగా దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దేవకృష్ణకు 12 ఏళ్ల క్రితం ప్రియాంకతో వివాహం జరిగింది. ప్రారంభంలో సవ్యంగా సాగిన వారి దాంపత్య జీవితంలో కలతలు మొదలయ్యాయి. ప్రియాంక, కమలేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడి మోజులో భర్త  అడ్డు తొలగించాలని నిర్ణయించుకుంది.

ఇదీ చదవండి: పార్కింగ్‌ కోసం తల నరికేస్తే : బంధువులు అతడిని కొట్టి చంపేశారు

ప్రియుడు కమలేష్‌తో కలిసి కుట్ర పన్నింది. కమలేష్, సురేంద్ర అనే వ్యక్తికి సుమారు లక్ష రూపాయల  సుపారీ ఇచ్చి దేవకృష్ణను హత్య చేయించేలా పథకం వేశారు. ప్రియాంక ఇంటికి కమలేష్, సురేంద్ర వచ్చి దేవకృష్ణపై దాడి చేసి చంపేశారు. అనంతరం ప్రియాంక దొంగలు ఇంట్లోకి చొరబడి, రూ. 3.5 లక్షల విలువైన వస్తువులను దోచుకుని, తన భర్త ప్రతిఘటించడంతో అతడిని చంపేశారని పోలీసుల ముందు వాపోయింది. మొదట్లో ఇది దోపిడీ, హత్యగానే భావించిన పోలీసులుసంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఇంట్లోనే నగలు, డబ్బు అలాగే ఉన్నట్లు గుర్తించారు. దీంతోపాటు, ప్రియాంక పదేపదేమాట మారుస్తూ ఉండటంతో అనుమానం పెరిగింది. తమదైన శైలిలో విచారించడంతో ఆమె అసలు విషయం బయటపెట్టింది. 

ఈ విషయాన్నిమొబైల్ ఫోన్ డేటాతో సహా సాంకేతిక ఆధారాలు, కమలేష్‌తో ఆమెకున్న సంబంధాన్ని, హత్య జరిగిన సమయంలో ఆమె చేసిన కాల్స్ ఆధారంగా దీన్ని మరింత నిర్ధారించుకున్నారు. అటు ప్రియాంక కూడా చేసిన నేరాన్ని ఒప్పుకుంది. దీంతో పోలీసులు ప్రియాంకతో పాటు కమలేష్, సురేంద్రలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. 

ఇదీ చదవండి: షుగర్‌ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement