- పార్కింగ్ వివాదంతో జంట హత్యలు
- బంధువుల ప్రతీకార హత్యతో పరిస్థితి ఉద్రిక్తం
- భారీగా మోహరించిన పోలీసులు
బిహార్‌లో జంట హత్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని రేపాయి. ఒక చిన్న పార్కింగ్ వివాదం రెండు హింసాత్మక ఘటనలకు దారి తీసింది. రోడ్డు పక్కన వ్యాపారి ఒక పికప్ డ్రైవర్‌ను తల నరికాడు, ఆ తర్వాత మృతుడి కుటుంబ సభ్యులు పోలీసుల ఎదుట నిందితుడిని హతమార్చిన కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం, అరేరియా జిల్లాలోని ఫోర్బ్స్‌గంజ్ పట్టణంలో గురువారం ఈ దారుణం చోటు చేసుకుంది. మృతుడైన డ్రైవర్‌ను అరేరియాలోని జోగ్బాని పట్టణానికి చెందిన అలీ హుస్సేన్‌గా గుర్తించారు. ప్రతీకారంగా హత్యకు గురైన రోడ్డు పక్కన వ్యాపారిని రవి చౌహాన్‌గా గుర్తించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఫోర్బ్స్‌గంజ్ పట్టణంలో ఒక చిన్న పార్కింగ్ సమస్యపై 'సత్తు' అమ్మే చౌహాన్, హుస్సేన్‌పై దాడి చేసి, అతని తల నరికి, అందరి ముందూ వీరంగం సృష్టించాడు. ఆ తర్వాత నిందితుడు మృతదేహాన్ని, నరికిన తలను సంఘటనా స్థలంలోనే వదిలిపెట్టి అక్కడినుంచివెళ్లి పోయాడు.
ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?
ఇది చూసి మృతుడి బంధువులు ఆగ్రహంతో రగిలిపోయారు. హుస్సేన్ బంధువులతోపాటు, స్థానికులు కూడా ఇంటి దగ్గర దాక్కున్న నిందితుడిని సంఘటనా స్థలానికి లాక్కొచ్చి, కర్రలతో, రాడ్లతో కొట్టి, పోలీసుల కళ్లెదుటే చంపేశారు. ఈ జంట హత్యల తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, పోలీసులకు, ఆగ్రహించిన గుంపుకు మధ్య ఘర్షణ జరిగింది. సంఘటనా స్థలం చుట్టూ ప్రజలు గుమిగూడటం ప్రారంభించడంతో, అదనపు పోలీసు బలగాలు మెహరించాయి. ఈ రెండు ఘటనల తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నప్పటికీ, పోలీసులు ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్ విత్ డ్రా : ఆమె ఎన్నిక ఇక లాంఛనమే!


