సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని బారామతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మాజీ ఎన్‌పీసీనేత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దివంగత అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ ఏకగ్రీవంగా గెలుపొందనున్నారు. కాంగ్రెస్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడంతో, ఏప్రిల్ 23న జరగాల్సిన బారామతి ఉప ఎన్నికలో సునేత్ర ఎంపిక ఏకగ్రీవం కానుంది.
గురువారం ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ చీఫ్ హర్షవర్ధన్ సప్కల్‌కు ఫోన్ చేసి, తమ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. దీంతో అజిత్ పవార్‌కు గౌరవ సూచకంగా కాంగ్రెస్ గురువారం మధ్యాహ్నం పోటీ నుంచి వైదొలగడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ ఉప ఎన్నికకు కాంగ్రెస్ ఆకాష్ మోర్‌ను పోటీలో నిలిపింది.
ఇదీ చదవండి: వ్యాపారవేత్త హత్య: దుబాయ్‌లో భారతీయ గ్యాంగ్‌స్టర్ అరెస్ట్
కాగా జనవరి 28న బారామతి ఎయిర్‌ఫీల్డ్‌లో అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం కూలిపోవడంతో మరణించిరు. 1991 ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచినప్పటి నుండి ఈ ఏడాది ఆయన మరణించే వరకు ఈ స్థానాన్ని అజిత్ పవార్ దక్కించుకున్నారు. అంతకుముందు, 1967 నుండి ఆయన మామ శరద్ పవార్ ఈ నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహించేవారు. పవార్ కుటుంబానికి కంచుకోటగా భావిస్తారు. అజిత్ మరణం తరువాత తన దివంగత భర్త స్థానంలో ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవార్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.


