అత్యంత అరుదుగా ఎదురయ్యే రైడ్ ఇది. దీనికి మాటలతో పనిలేదు. ఈ అసాధారణమైన రైడ్‌ని టెక్నాలజీ మాటలతో పనిలేకుండానే సమన్వయం అయ్యేలా చేసింది. ఎలా సాగుతుందో అనుకున్న జర్నీ కాస్తా సాంకేతికత అద్భుతమైన ముగింపు ఇచ్చి దివ్యాంగుల్లో ధైర్యాన్ని నూరిపోసింది. అందుకు సంబంధించని పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ పోస్ట్‌ని గ్రెయిల్‌మేకర్ ఇన్నోవేషన్స్ సహ-వ్యవస్థాపకురాలు ఐశ్వర్య టి వి పిళ్లై లింక్డ్‌ఇన్‌లో షేర్ చేశారు. ఆ పోస్ట్‌లో ఆమె తనకెదురైన అనుభవాన్ని పంచుకున్నారు. ఆమె ఒక రోజు రైడ్‌ని బుక్ చేసినట్లు తెలిపారు. అది కన్ఫర్మ్ అయ్యింది. డ్రైవర్ చెవిటివాడని, అర్థమైంది. తాను అంధురాలు కాబట్టి ఆ రైడ్ ఎలా ఉంటుందో ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉందామెకు. ఆ రైడ్‌ని రద్దు చేద్దామనుకుంది కానీ ఆ తర్వాత ఏ జరుగుతుందో చూడాలనే కుతుహలంతో ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. అనుకున్నట్లుగానే క్యాబ్ వచ్చింది.
తాను చేతికర్రతో సహా లోపలికి ఎక్కాను కాబట్టి ఆ డ్రైవర్‌కి తన పరిస్థితి అర్థమయ్యే ఉంటుందని భావించింది. తాను ఫోన్‌లో ఏదో టైప్ చేస్తున్నట్లుగా ఓపెన్ చేసి అతడికి ఓటీపీ చూపించింది. ఆ తర్వాత ఆమె తాను వెళ్లే ఆఫీస్ ఎంట్రీ వద్ద నేరుగా దించమని టెక్స్ట్ మెసేజ్ పంపింది. ఆ ఉబర్ డ్రైవర్ అర్థం చేసుకున్నాడు. గమ్యస్థానం రాగానే అతను కారు దిగి ఎవరినో పిలిచాడు. ఆ తర్వాతన ఆమె కారు దిగింది.
ఇంతలో సెక్యూరిటీ గార్డు వచ్చి ఆమెన ప్రవేశ ద్వారం వద్దకు నడిపించాడు. కించెత్తు సంభాషణ కూడా లేకుండా అంతా అర్థమయ్యేలా సాఫీగా సాగిపోయిందా ఆజర్నీ. ఆ రైడ్‌కి నిజంగా ఐదు స్టార్‌లు అంటూ పోస్ట్‌ని ముగించింది పిళ్లై. నెజిజన్లు కూడా ఈ పోస్ట్‌పై ప్రశంసల జల్లు కురిపించడమే గాక, వైకల్యాలను అధిగమించేలా చేసిన సాంకేతిక అద్భుతం అని కొనియాడారు.
(చదవండి: ఆ ఐపీఎస్ జంట వివాహంలో..హాట్‌టాపిక్‌గా ‘దూద్ పిలాయ్’ ఆచారం!)


