ఆ వ్యాధి మళ్లీ తిరగబెడుతుందని ఊహించలేదు..! : దీపికా కక్కర్‌ | Dipika Kakar Said Recurrence Of Cyst Has Left Her Shaken | Sakshi
Sakshi News home page

Dipika Kakar: మళ్లీ తిరగబెడుతుందని ఊహించలేదు..! కనీసం కొడుకుతో..

Apr 10 2026 11:56 AM | Updated on Apr 10 2026 12:42 PM

Dipika Kakar Said Recurrence Of Cyst Has Left Her Shaken

దీపికా కక్కర్ టెలివిజన్ పరిశ్రమలో అత్యంత ప్రియమైన నటీమణులలో ఒకరు. ససురాల్ సిమర్ కా , కహాం హమ్ కహాం తుమ్‌లాంటి షోల  పాత్రల్లోని నటనతో పాపులర్‌ అయింది.  ఒకప్పుడు అత్యధిక పారితోషికం తీసుకునే టెలివిజన్ నటిగా నిలిచింది. ఆమె గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. గతేడాది వైద్యులు ఆమె కాలేయం దగ్గర టెన్నిస్ బంతి పరిమాణంలో కేన్సర్ గడ్డ ఉందని నిర్థారించినట్లు తెలిపారామె. వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేసి ఆ గడ్డతోపాటు కాలేయంలో 22 శాతం తొలగించారు. 

హమ్మయ్యా బయటపడ్డాను అనుకునేలోపే ఆ వ్యాధి మరోసారి తిరగబట్టి గట్టి షాకిచ్చింది. దీంతో ఆస్పత్రులు చుట్టూ తిరుగుతూ..కనీసం మాతృత్వాన్ని ఆస్వాదించలేకపోతున్నాననంటూ తన గోడును సోషల్‌ మీడియా వేదికగా వెళ్లబోసుకుంది. అంతేగాదు ఆరోగ్య సమస్యలు వ్యక్తిగత జీవితాన్ని ఎలా ఇరకాటంలో పడేస్తాయో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

నటి దీపికా కాకర్‌కు కాలేయం దగ్గర 1.3 సెం.మీ సిస్ట్‌ మళ్లీ రావడంతో మరో శస్త్ర చికిత్స జరిగింది. కాలేయ కేన్సర్‌కు చికిత్స పొందుతున్న దీపికాకు ఈ కేన్సర్‌ మళ్లీ తిరగబెట్టడం ఒక భావోద్వేగపరమైన ఎదురుదెబ్బగా మారిందామెకు. ఈ మేరకు పోస్ట్‌లో ఊహించన ఈ మలుపు తనను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోందని పంచుకున్నారు. తన ఆరోగ్య సమస్యలు వ్యక్తిగత జీవితాన్ని, ముఖ్యంగా మాతృత్వాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోందని వాపోయారు. 

తన కొడుకు రుహాన్‌తో సమయం గడపలేకపోతున్నాన్న బాధ తనను కలిచివేస్తోందని అంటోంది. ఆస్పత్రి సందర్శనలే దినచర్యగా మారిపోవడంతో అలిసిపోతున్నానని అంటోంది. ఇక తన భర్త షోయబ్‌ తన కారణంగా పనులతో బిజీ అయిపోయాడని చెప్పుకొచ్చింది. ఆస్పత్రిలో ఉంటే రుహాన్‌ చూడలేను పోనీ ఇంటికి వస్తే చికిత్సతో అలిసిపోయి పడుకుంటాను అంతే ఇది తన దినచర్యను పూర్తిగా మార్చేసిందన్నారు. నిజానికి అనారోగ్యంతో ఉన్నప్పుడే మనం బలంగా ఉండాలి, సానుకూలంగా ఉండాలి. కానీ ఊహించని విధంగా మరోసారి ఈ కేన్సర్‌ తిరగబెట్టడం ఒకింత బాధ, భయం ఆవరించాయని కన్నీటి పర్యంతమైంది. 

ఒకరకంగా ఈ పరిస్థితి తన ఆరోగ్యం, జీవనశైలి పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేసిందన్నారు. మన శరీరాలు చలా సంక్లిష్టమైనవి, బలమైనవి, ప్రతిరోజు వివిధ చికిత్సలు తట్టుకుంటున్నందుకు అవి నిజంగా గొప్పవి అని మెచ్చుకుంది. ఏ అనారోగ్యం వచ్చినా..మన శరీరంలో హార్మోన్లు ఎంతలా మార్పులు చెందినా..మన జీవితాలను సజావుగా గడుపుతామని అన్నారు. తనలా మళ్లీ మళ్లీ సిస్ట్‌ వచ్చినా కొందరితో మాట్లాడుతూ.. ఈ సమస్యను ఎదుర్కొనేలా తనను తాను బలోపేతం చేసుకుంటున్నట్లు తెలిపారు దీపికా. 

అలాగే అనారోగ్యం కారణంగా క్రమం తప్పకుండా వ్లాగ్లో పోస్ట్‌లు పెట్టలేకపోతున్నానని అన్నారు. తన చుట్టూ ఉన్నవారు నవ్వుతూనే ఉంటున్నారు కానీ, లోపల ఎంత ఆందోళన ఉందో గ్రహించగలను, ముఖ్యంగా అమ్మ, అత్తయ్య ఎంత బాధపడుతున్నారో ఊహించగలను అంటూ తన పోస్ట్‌ని ముగించింది.
(చదవండి: పుష్-అప్స్‌లో ఈ 75 ఏళ్ల బామ్మే స్ఫూర్తి..! జస్ట్‌ 12 వారాల్లో..)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement