పుష్-అప్స్‌లో ఈ 75 ఏళ్ల బామ్మే స్ఫూర్తి..! జస్ట్‌ 12 వారాల్లో.. | A 75-year-old woman perfecting push-ups In 12 Weeks | Sakshi
Sakshi News home page

పుష్-అప్స్‌లో ఈ 75 ఏళ్ల బామ్మే స్ఫూర్తి..! జస్ట్‌ 12 వారాల్లో..

Apr 10 2026 10:05 AM | Updated on Apr 10 2026 11:25 AM

 A 75-year-old woman perfecting push-ups  In 12 Weeks

ఈ ఏజ్‌లో అంత కష్టతరమైన వ్యాయామాలు మావల్ల కాదు అనే వాళ్లకు ఈ బామ్మే ఆదర్శం. చేయాలనే గట్టి సంకల్పం ఉంటే వయసు అనేది పెద్ద సమ్య కాదని ఈ బామ్మని చూస్తే తెలుస్తుంది. పెద్ద వయసువారైన సులభంగా క్లిష్టమైన వ్యాయమాలు చేయాలంటే కేవలం ఓపిక, నిలకడే అత్యంత కీలకం అని ఈ సూపర్‌ బామ్మని చూస్తే అర్థమవుతోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ  వైరల్‌ అవుతోంది.

ఆ వీడియో క్లిప్‌లో కనిపిస్తున్న మహిళ పేరు అమృత్‌ కౌర్‌. 75 ఏళ్ల వయసులో మరింత బలంగా ఉండేందుకు చిన్నపాటి కదలికల కోసం వ్యాయమాలు చేస్తూ కనిపిస్తుంటుందామె. ముఖ్యంగా ఆ వృద్ధాప్య వయసులో పుష్‌ అప్‌లు చేసేందుకు పడ్డ శ్రమ చూస్తే..నోరెళ్ల బెట్టడం ఖాయం. మొదట కొన్నింటి సాయంతో పుష్‌ అప్‌లు చేస్తుంటుంది. 

ఆ తర్వాత మోకాళ్లు, చిన్న పరికరాల సాయంతో పుష్‌ అప్‌లు చేస్తుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో వేటి సాయం లేకుండా సునాయాసంగా పుష్‌ అప్‌లు చేస్తుంటుంద. నిలకడతో చేస్తూ ఉంటే..ఎంత కష్టమైన వ్యాయామాలైన ఈజీగా చేసేయొచ్చని ఈ బామ్మని చూస్తే అర్థమవుతుంది. ఈ బామ్మ జస్ట్‌ 12 వారాల్లో పుష్‌ అప్‌లో పట్టు సాధించింది. 

రోజు జిమ్‌కి వచ్చేవారు సైతం సిగ్గుపడేలా ఎంత అద్భుతంగా చేసిందో చూస్తే మాటలు రావు. నెటిజన్లు ఇకపై ఎలాంటి సాకులు చెప్పకండి ఈ బామ్మని చూసి స్ఫూర్తి పొందండి, అమ్మో బామ్మ నువ్వు చాలా గ్రేట్‌ అని రకరకాలు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: ఆ రైడ్‌కి ఐదు స్టార్‌లు..! కించెత్తు సంభాషణకు నో ఛాన్స్‌..)

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement