breaking news
Dipika Kakar
-
క్యాన్సర్ బారిన పడిన నటి.. లివర్‌లో టెన్నిస్ బాల్ సైజ్ కణితి!
ప్రముఖ టీవి నటి దీపికా కాకర్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ పోస్ట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గత కొన్ని వారాలుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న దీపికా, ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా, ఆమె కాలేయంలో టెన్నిస్ బాల్ పరిమాణంలో కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తదుపరి పరీక్షల్లో ఇది స్టేజ్-2 మాలిగ్నెంట్ (క్యాన్సరస్) కణితిగా నిర్ధారణ అయింది.దీపికా తన పోస్ట్‌లో, "గత కొన్ని వారాలు మాకు చాలా కష్టంగా గడిచాయి. కడుపు పైభాగంలో నొప్పితో ఆస్పత్రికి వెళ్లగా, కాలేయంలో కణితి ఉన్నట్లు తెలిసింది. ఇది స్టేజ్-2 క్యాన్సర్‌గా నిర్ధారణ అయింది. ఈ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొంటాను. దేవుని అనుగ్రహంతో పాటు, నా అభిమానుల ఆశీర్వాదాలు, ప్రేమతో ఈ కష్టాన్ని అధిగమిస్తానని నమ్ముతున్నాను’ అని దీపికా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీపికా త్వరగా కోలుకోవాలని నెటిజన్స్, సహ నటులు కామెంట్లు చేస్తూ, ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.కాగా, ఇటీవల జమ్ము కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి నుంచి దీపికా కాకర్ కుటుంబం తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. ‘ససురల్ సిమర్ కా’ సీరియల్‌తో బాగా పాపులర్ అయిన దీపికా, తన భర్త షోయబ్ ఇబ్రహీం, కుమారుడు రుహాన్‌తో కలిసి కశ్మీర్లో విహారయాత్రకు వెళ్లారు. వారు పహల్గాం సహా పలు ప్రాంతాలను సందర్శించారు. వారు తమ వెకేషన్‌ను ముగించుకుని తిరిగి వచ్చిన కొన్ని గంటల్లోనే పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఈ విషయాన్ని దీపికా-షోయబ్ జంట సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ, తాము క్షేమంగా ఉన్నామని అభిమానులకు తెలియజేశారు. దీపిక కాకర్ టెలివిజన్ పరిశ్రమలో అత్యంత ప్రియమైన నటీమణులలో ఒకరు.ససురాల్ సిమర్ కా , కహాం హమ్ కహాం తుమ్‌లాంటి షోల పాత్రల్లోని నటనతో పాపులర్ అయింది. ఒకప్పుడు అత్యధిక పారితోషికం తీసుకునే టెలివిజన్ నటిగా నిలిచింది. టీవీ నటిగా వచ్చిన పాపులారిటీతోనే 2018లో హిందీ బిగ్ బాస్ 12 రియాలిటీ షోలో విన్నర్‌గా నిలిచింది. అదే ఏడాదిలో షోయబ్ ఇబ్రహీంతో వివాహం జరిగింది. వీరికి 2023లో రుహాన్ అనే కుమారుడు జన్మించాడు. దీపికా తాజాగా ‘సెలబ్రిటీ మాస్టర్‌షెఫ్ ఇండియా’ షోలో కనిపించారు. View this post on Instagram A post shared by Dipika (@ms.dipika) -
పహల్గాం ఉగ్రదాడి.. తృటిలో తప్పించుకున్న నటి..నెటిజన్స్ ఫైర్!
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం(ఏప్రిల్ 22)జరిగిన ఉగ్రదాడి (Pahalgam terror attack) నుంచి ప్రముఖ టెలివిజన్ నటి దీపికా కాకర్, ఆమె భర్త షోయబ్ ఇబ్రహీం తృటిలో తప్పించుకున్నారు. ‘ససురల్ సిమర్ కా’ సీరియల్‌తో పాపులర్ అయిన నటి దీపికా తన భర్త షోయబ్, కుమారుడు రుహాన్‌తో కలిసి కశ్మీర్లో విహార యాత్రకు వెళ్లారు. పర్యటనలో భాగంగా పహల్గాంకు కూడా వెళ్లారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో..దాడి సమయంలో వారు కూడా అక్కడే ఉన్నారేమోనని అభిమానులు ఆందోళన చెందారు. అయితే దాడి కంటే ముందే ఈ జంట కశ్మిర్ నుంచి ఢిల్లీకి చేరుకుంది.ఈ విషయాన్ని షోయబ్ ఇబ్రహీం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులకు తెలియజేశారు. ‘అందరికి హాయ్, మా గురించి మీరంతా ఆందోళన చెందుతున్నారు. మేము సురక్షితంగా ఉన్నాం. మంగళవారం ఉదయమే మేము కశ్మీర్ నుంచి బయల్దేరి సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నాం. ఎవరూ ఆందోళన పడకండి’ అని ఆయన పేర్కొనడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే షోయబ్ పోస్ట్‌పై కొంతమంది నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. సురక్షితంగా ఢిల్లీకి చేరామని చెబుతూనే.. ఈ పర్యటనపై వ్లాగ్ చేశామని, అది త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. ఒకవైపు ఉగ్రదాడితో దేశమంతా బాధపడుతుంటే.. వ్లాగ్ గురించి ప్రచారం చేసుకోవడం ఏంటని నెటిజన్స్ మండిపడుతున్నారు. ఈ విషాద సమయంలో వ్లాగ్ గురించి చెప్పాల్సిన అవసరం ఏముందని కామెంట్స్ చేస్తున్నారు.కాగా, మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రవాదులు అత్యంత ఘోరంగా దాడి చేశారు. మ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం ఉగ్రవాదులు తెగబడ్డారు. ప్రకృతి అందాలను తిలకించేందుకు వచ్చిన పర్యటకులపై పాశవికంగా దాడి చేసి 28 మందిని పొట్టన పెట్టకున్నారు. ఈ దాడి చేసింది తామేనంటూ లష్కరే ముసుగు సంస్థ టీఆర్ఎఫ్ ప్రకటించింది. View this post on Instagram A post shared by Dipika (@ms.dipika) -
రెండో భర్తతో బుల్లితెర నటి విడాకులు.. స్పందించిన భామ!
సినీ ఇండస్ట్రీలో విడాకులు అనే పదం కామన్ అయిపోయింది. పలువురు సినీతారలు తమ వివాహ బంధానికి మధ్యలోనే ముగించేస్తున్నారు. గతేడాది మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సైతం తన భార్య సైరా భానుతో విడిపోయారు. దాదాపు 27 వారి వివాహ బంధానికి గుడ్ బై చెప్పేశారు. తాజాగా మరో బాలీవుడ్ జంట విడాకులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పెళ్లైన ఏడేళ్లకు వీరిద్దరు విడిపోతున్నారంటూ టాక్ నడుస్తోంది. ప్రముఖ బుల్లితెర నటి దీపికా కకర్ ఆమె రెండో భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు గత కొద్ది రోజులు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలో తమపై వస్తున్న విడాకుల రూమర్స్‌పై బుల్లితెర జంట స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తలన్నీ ఫేక్ అన్ని కొట్టిపారేశారు. అవీ చూస్తుంటే తమకు నవ్వాలనిపిస్తోందని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దీపికా ఆమె భర్త షోయబ్ విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చారు. 2018లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఓ కుమారుడు కూడా జన్మించారు.దీపిక కక్కర్, షోయబ్ ప్రముఖ బాలీవుడ్ సీరియల్ ససురల్ సిమర్ కా సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో 2018లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అంతకుముందు దీపిక కక్కర్ పైలట్ రౌనక్ శాంసన్‌ను 2011లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత 2015లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత షోయబ్‌ను పెళ్లాడగా..2023లో కుమారుడు రుహాన్‌ను స్వాగతించారు.