
ప్రముఖ టెలివిజన్ నటి, దీపికా కాకర్(Dipika Kakar) షోయబ్ ఇబ్రహీంల జంట బాలీవుడ్‌లో ఎంతో ఫేమస్ తెలిసింది. ఎప్పటికప్పడూ సోషల్ మీడియాలో తమ విషయాలను షేర్ చేస్తూ..తమ అభిమానులను సంతోషపరుస్తూ ఉంటారు. అలానే ఈసారి తమ హెయిర్ సీక్రెట్‌కి సంబంధించిన వీడియోని పోస్ట్ చేస్తూ..తమ అందమైన కురులు రహస్యం బియ్యపిండి మాస్క్ అని వెల్లడించారు. దీన్ని తమ రెండేళ్ల కుమారుడి జుట్టుకి కూడా అప్లై చేస్తామని, ఇది శిరోజాలకు ఎంతో మంచిదంటూ చెప్పుకొచ్చారు అంతేగాదు ఇందులో ఎలాంటి పదార్థాలు ఉపయోగిస్తారో కూడా వివరించాడు ఆమె భర్త షోయబ్ ఇబ్రహీం. అసలేంటి ఈ ప్యాక్..?, ఇది నిజంగానే హెయిర్‌కి మంచిదా అనే వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం.
బియ్యపిండి మాస్క్(Rice Flour mask)లో బియ్య పిండి, అవిసె గింజెలు, కొబ్బరి నూనెల మిశ్రమమే ఈ బియ్యపిండి మాస్క్. ఇది కురులను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని చెబుతున్నారు దీపికా కకార్ దంపతులు. మరి ఇది హెయిర్‌కి మంచిదేనా..?, అంత చిన్నపిల్లలకు అప్లై చేయొచ్చా? అంటే..
నిపుణులు ఏమంటున్నారంటే..
ప్రముఖ నిపుణులు ఇందులో ఉపయోగించే బియ్యపిండి, అవిసె గింజలు, కొబ్బరి నూనె వంటి వన్నీ సహజ పదార్థాలని, వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయని అన్నారు. అయితే పెద్దలకు మంచివైనవి ఎప్పుడూ చిన్నారులకు మంచివి కావనే విషయం గుర్తెరగాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
ఎందుకంటే వారి చర్మం చాలా సున్నితం..అందులోనూ వారి బుర్ర ఇంకా గట్టిపడదు..కాబట్టి అక్కడ చర్మం మరింత మృదువుగా ఉంటుందట. కాబట్టి ఇలాంటి వంటింటి చిట్కాలను అనుసరించే మందు కాస్త కేర్‌ఫుల్‌గా ఉండాలన్నారు.
జుట్టుకి మంచిదేనా అంటే..
బియ్యపిండి జుట్టుని సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేసి అదనపు నూనెలను తొలగిస్తుందట. అలాగే ఇక్కడ అవిసె గింజల్లో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కురుల ఆకృతిని మెరుగుపరుస్తాయిట. ఇక కొబ్బరి నూనె జుట్టుని తేమగా ఉండేలా చేస్తుందట. కానీ శిశువు చర్మానికి ఇవి అస్సలు పనికిరావనిచెబుతున్నారు.
అంతేగాదు బియ్యపిండిలో ఉండే అమైనో ఆమ్లాలు, స్టార్చ్ జుట్టుని బలోపేతం చేసి మెరిసేలా చేస్తాయట. అవిసెగింజల్లోని యాంటీ ఆక్సిడెండ్లు జుట్టుని ఉండలు కట్టకుండా చేస్తుందట. తలపై మంటను తగ్గించి, పెరుగుదలను ప్రేరేపింస్తుందట. పర్యావరణ హానికరమైన ప్రభావాన్ని నుంచి రక్షిస్తుందట. నిజానికి ఈ పదార్థాలన్నీ జుట్టు వేగవంతంగా పెరిగేలా చేయకపోయినా..ఆరోగ్యంగా..మెరుగ్గా ఉండేలా చేస్తాయట. తత్ఫలితంగా జుట్టు పెరుగుదల సులభతరం అవుతుందని చెబుతున్నారు నిపుణులు.
అలాగే సహజసిద్ధమైనవన్ని సురక్షితం కాదనే విషయం గమనించాలని అంటున్నారు నిపుణులు. అవన్ని ఇంట్లో పరిశుభ్రమైన పద్ధతిలో తయారైనవే అని నిర్థారించుకోవాలని చెబుతున్నారు. అలాగే శిశువులకు ఉపయోగించాలనుకుంటే మందుగా డెర్మటాలజిస్టులను సంప్రదించాలని సూచించారు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: 44 కిలోల బరువు తగ్గిన ఫిట్‌నెస్ కోచ్..! సరికొత్తగా వెయిట్‌లాస్ పాఠాలు..)