ఒకేరోజు ఫస్ట్, సెకండియర్ రిజల్ట్స్ విడుదల
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాల విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 12న ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు రెండూ విడుదల చేసేందుకు బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు కలిపి 1,495 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.
అలాగే 5 పరీక్ష కేంద్రాలు పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. మొదటి సంవత్సరం విద్యా ర్థులు 4,89,126 మందికి, రెండో సంవత్సరం విద్యార్థులు 5,07,949 మందికి హాల్ టికెట్లు జారీ అయ్యాయి. మార్చి 18న పరీక్షలు పూర్తి కావడానికి ముందే మూల్యాంకనం మొదలైంది. దీంతో ఆ నెలాఖరుకే ఫలితాలు సిద్ధమ య్యాయి. ఈ నేపథ్యంలో ఈనెల మొదటి వారంలోనే ఫలితాలు వెల్లడిస్తామని అధికా రులు మొదట్లో ప్రకటించినప్పటికీ అనివార్య కారణాలతో ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది.


