intermediate results released
-
గ్రామీణం.. గురుకులం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఈసారి అత్యంత గ్రామీణ నేపథ్యమున్న జిల్లాలు సత్తా చాటాయి. మరోవైపు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్‌ఆర్‌ఈఐఎస్) సొసైటీ పరిధిలోని జూనియర్ కాలేజీలు మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. కాగా ఈ ఏడాది ఫలితాల్లో బాలురతో పోలిస్తే బాలికలు అత్యధిక ఉత్తీర్ణత శాతంతో పైచేయి సాధించారు. ఆదివారం ఇంటర్మిడియెట్ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా సంయుక్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేశారు.ఫస్టియర్, సెకెండియర్ నుంచి మొత్తం 9,43,055 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా..వీరిలో 6,65,791 మంది (70.60%) ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 4,84,537 మంది బాలికలకు గాను 3,78,554 మంది (78.13%) ఉత్తీర్ణులవగా.. మొత్తం 4,58,518 మంది బాలురకు గాను 2,87,236 మంది (62.64%) ఉత్తీర్ణులయ్యారు. అంటే బాలికలు 15.49% అధికంగా ఉత్తీర్ణులయ్యారన్నమాట. గతే డాది మొత్తం ఉత్తీర్ణత 65.81% నమోదు కాగా... ఈసారి 4.79% పెరిగి 70.60% నమోదైంది. ఫస్ట్, సెకెండియర్లో ఇలా.. ఫస్టియర్‌లో 2,49,110 మంది బాలికలు పరీక్షలు రాయగా 1,85,331 మంది (74.40) ఉత్తీర్ణులయ్యారు. 2,40,013 మంది బాలురకు గాను 1,38,475 మంది పాసై 57.69% ఉత్తీర్ణత నమోదు చేశారు. సెకెండియర్లో 2,35,427 మంది బాలికలు హాజరు కాగా 1,93,223 (82.07%) మంది పాసయ్యారు. 2,18,505 మంది బాలురకు గాను 1,48,761 (68.08%) మంది పాసయ్యారు. అట్టడుగున మహబూబాబాద్, సిరిసిల్ల జిల్లాలుఇంటర్ ఫలితాల్లో మేడ్చల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు అగ్రస్థానంలో నిలిచాయి. ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవగా..సెకెండియర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఫస్టియర్ టాప్ మూడు జిల్లాలుగా మేడ్చల్, రంగారెడ్డి, భూపాలపల్లి జిల్లాలు నిలవగా..విద్యార్థులు డిగ్రీలో ప్రవేశించేందుకు కీలకమైన సెకెండియర్లో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండే భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్ జిల్లాలు విజయభేరి మోగించి ముందువరుసలో నిలవడం గమనార్హం. కాగా ఫస్టియర్‌లో 48.10% ఉత్తీర్ణతతో మహబూబాబాద్ జిల్లా చిట్టచివరి స్థానంలో ఉండగా, సెకెండియర్లో 55.68% ఉత్తీర్ణతతో రాజన్న సిరిసిల్ల జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచింది. టీఎస్ఆర్జేసీ టాప్ ఇంటర్ పరీక్షల్లో తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్‌ఆర్‌ఈఐఎస్) పరిధిలోని జూనియర్ కాలేజీలు మొదటి స్థానంలో నిలిచాయి. ఈ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు అత్యధిక శాతం ఉత్తీర్ణులయ్యారు. సొసైటీ పరిధిలో మొత్తం 35 జూనియర్ కాలేజీలున్నాయి. ఫస్టియర్‌లో 2,560 మంది పరీక్షలు రాయగా 2,374 (92.73%) మంది పాసయ్యారు. సెకెండియర్లో 2,413 మంది పరీక్షలు రాయగా 2,269 (94.03%) మంది ఉత్తీర్ణులయ్యారు. అత్యధిక ఉత్తీర్ణత శాతంతో ఈ సొసైటీ కాలేజీలు మొదటి స్థానాన్ని ఆక్రమించాయి. ప్రైవేటు కాలేజీలతో పోలిస్తే సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, కేజీబీవీల్లో ఫలితాలు మెరుగ్గా ఉండటం గమనార్హం. ప్రైవేటు, ప్రభుత్వ కాలేజీల్లో ఫలితాలు ఇలా.. విద్యాశాఖ పరిధిలోని మోడల్ స్కూల్స్‌లో ఇంటర్మిడియెట్ ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం రాష్ట్ర సగటు కంటే చాలా తక్కువగా నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల నుంచి ఫస్టియర్‌లో 68,100 మంది పరీక్షలు రాయగా సగానికంటే తక్కువగా 28,937 (42.49%) మంది మాత్రమే పాసయ్యారు. సెకెండియర్లో ఉత్తీర్ణత కాస్త మెరుగ్గా ఉంది. 58,743 మందికి గాను 35,165 (59.86) మంది పాసయ్యారు. ఇక రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల నుంచి ఫస్టియర్‌లో 3,30,811 మంది పరీక్షలకు హాజరు కాగా 2,31,535 మంది పాసై 69.99% ఉత్తీర్ణత సాధించారు. సెకెండియర్లో 2,97,951 మంది రాయగా.. 2,13,250 (71.57%) మంది ఉత్తీర్ణులయ్యారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు నేటి నుంచి చాన్స్ ప్రస్తుత ఫలితాలకు సంబంధించి విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కమ్ స్కాన్డ్ కాపీ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్్ట్స కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. రీ కౌంటింగ్ కోసం ఒక్కో పేపర్‌కు రూ.100 చొప్పున చెల్లించాలి. స్కాన్డ్ కాపీ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ కోసం ఒక్కో పేపర్‌కు రూ.800 చొప్పున చెల్లించాలి. ఇందుకోసం ఈనెల 13వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య ఆన్లైన్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అడ్వాన్స్‌డ్‌కు సిద్ధం కండి: కేకే ఫలితాలు విడుదల చేసిన తర్వాత ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు మాట్లాడారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఫెయిలైన విద్యార్థులు చింతించకుండా అడ్వాన్స్డ్ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. ఇంటర్మీడియెట్ అనేది భవిష్యత్ ప్రణాళికలకు పునాది అని అన్నారు. ఫలితాల విడుదలలో అధికారుల కృషిని అభినందించారు. కాగా ఇంటర్ ఫలితాలను అత్యంత పకడ్బందీ చర్యలు చేపట్టి ప్రకటించామని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాల్లో మూల్యాంకనం నిర్వహించామన్నారు. మే 13 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను బోర్డు వెల్లడించింది. మే 13వ తేదీ నుంచి వీటిని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రాక్టికల్ పరీక్షలను ఇదే నెల 22వ తేదీ నుంచి నిర్వహిస్తామని తెలిపింది. ఈ పరీక్షల ఫీజును ఈనెల 13వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య సంబంధిత కాలేజీలో చెల్లించాలని సూచించింది. గత ఏడాది గణాంకాలు పునరావృతం! ఇంటర్మీడియెట్ ఫలితాల విడుదలలో బోర్డు ఉదాసీనత వెల్లడైంది. యాజమాన్యాల (మేనేజ్మెంట్) వారీగా ఫలితాల పట్టికలో చాలావరకు గతేడాది ఇచ్చిన గణాంకాలే పునరావృతమయ్యాయి. ఇందులో ప్రధానంగా మొదటి సంవత్సరం విద్యార్థుల హాజరు, ఉత్తీర్ణత, పాస్ పర్సంటేజీ అంతా య«థాతథంగా వెల్లడించారు. తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ (టీఎస్ఆర్జేసీ)లు, టీజీఎస్‌ఆరీ్టసీ, సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీలు, కేంద్ర ప్రభుత్వ కాలేజీలు, రాష్ట్ర ప్రభుత్వ స్పోర్ట్స్ కాలేజీలు, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్‌కు సంబంధించి మొదటి సంవత్సరం విద్యార్థులు, పాసైన వారి సంఖ్య, ఉత్తీర్ణత శాతం గణాంకాలు ఒకే విధంగా ఉండడం గమనార్హం. 41 కాలేజీల్లో 100% ఫలితాలు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని 41 కాలేజీల్లో సెకెండియర్లో నూటికి నూరు శాతం ఫలితాలు వచ్చాయి. దీనిపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఫస్టియర్‌లో 12 కాలేజీలు 100% ఉత్తీర్ణత సాధిస్తే..సెకెండియర్లో 41 కాలేజీలు 100% ఫలితాలు సాధించాయని తెలిపారు. ఫస్టియర్ ఎంపీసీలో 470 మార్కులకు 468 మార్కులు ఏడుగురు విద్యార్థులు సాధించారని, అలాగే బైపీసీలో 440 మార్కులకు 438 మార్కులు ఐదుగురు విద్యార్థులు సాధించారని వెల్లడించారు. ఆర్ట్స్ గ్రూప్‌లో ఒక విద్యార్థి 500 మార్కులకు 494 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఇక ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీలో ఇద్దరు విద్యార్థులు 995 మార్కులు సాధించగా, బైపీసీలో ఒక విద్యార్థి 994 మార్కులు సాధించారని మంత్రి పేర్కొన్నారు. ఆర్ట్స్ గ్రూప్‌లో ఒక విద్యార్థి 985 మార్కులు సాధించాడన్నారు. -
Telangana: రేపు ఇంటర్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాల విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 12న ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు రెండూ విడుదల చేసేందుకు బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు కలిపి 1,495 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.అలాగే 5 పరీక్ష కేంద్రాలు పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. మొదటి సంవత్సరం విద్యా ర్థులు 4,89,126 మందికి, రెండో సంవత్సరం విద్యార్థులు 5,07,949 మందికి హాల్ టికెట్లు జారీ అయ్యాయి. మార్చి 18న పరీక్షలు పూర్తి కావడానికి ముందే మూల్యాంకనం మొదలైంది. దీంతో ఆ నెలాఖరుకే ఫలితాలు సిద్ధమ య్యాయి. ఈ నేపథ్యంలో ఈనెల మొదటి వారంలోనే ఫలితాలు వెల్లడిస్తామని అధికా రులు మొదట్లో ప్రకటించినప్పటికీ అనివార్య కారణాలతో ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది. -
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ -2022 ఫలితాలు వచ్చేశాయ్. బుధవారం మధ్యాహ్నం విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేసి.. మీడియాతో ఫలితాల గురించి మాట్లాడారు. ఫస్టియర్‌లో 2,41,591 మంది పాస్ కాగా, ఫస్టియర్‌లో 54 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. సెకండియర్‌లో 2,58,449 మంది పాస్ కాగా, 61 ఉత్తీర్ణత శాతం రికార్డు అయ్యింది. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉంది. ఉత్తీర్ణతలో కృష్ణా జిల్లా టాప్‌గా నిలిచిందని, రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం జూన్ 25వ తేదీ నుంచి జులై 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రికార్డు స్థాయిలో 28 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. జవాబు పత్రాల మూల్యాంకనాన్ని వేగంగా, జాగ్రత్తగా పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కామ్(www.sakshieducation.com)లో చూడొచ్చు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఉత్తీర్ణతలో బాలురకన్నా బాలికలే ఆధిక్యంలో నిలిచారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం విజయవాడలో ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో 10,64,626 మంది (ఫస్టియర్ 5,46,365, సెకండియర్ 5,18,261) ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ఫస్టియర్ జనరల్‌లో 59 శాతం, ఒకేషనల్‌లో 41 శాతం, సెకండియర్ జనరల్‌లో 63 శాతం, ఒకేషనల్‌లో 52 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అన్ని కేటగిరీల్లోనూ బాలికలు పైచేయి సాధించారు. జనరల్ కేటగిరీ ఫస్టియర్ పరీక్షలకు 2,57,619 మంది బాలికలు హాజరు కాగా 1,64,365 (64 శాతం), సెకండియర్ పరీక్షలకు 2,22,798 మంది బాలికలు హాజరు కాగా.. 1,49,010 (67 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర విషయానికి వస్తే.. జనరల్ కేటగిరీ ఫస్టియర్ పరీక్షలకు 2,49,611 మంది హాజరు కాగా.. 1,36,195 (55 శాతం), సెకండియర్‌లో 2,12,857 మందికి గాను 1,27,379 (60 శాతం) మంది పాసయ్యారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లోనూ 75 శాతం ఉత్తీర్ణత సాధించి కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఫస్టియర్‌లో 65 శాతం, సెకండియర్‌లో 71 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమ గోదావరి జిల్లా రెండో స్థానంలో నిలిచింది. విశాఖ జిల్లా ఫస్టియర్‌లో 63 శాతం, సెకండియర్‌లో 68 శాతం ఉత్తీర్ణత సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఉత్తీర్ణతా శాతంలో వైఎస్సార్ (ఫస్టియర్ 47 శాతం, సెకండియర్ 52 శాతం), శ్రీకాకుళం (ఫస్టియర్ 51 శాతం, సెకండియర్ 53 శాతం), కర్నూలు (ఫస్టియర్ 51 శాతం, సెకండియర్ 54 శాతం) జిల్లాలు వెనుకబడ్డాయి. -
బయటపడుతున్న గ్లోబరీనా మోసాలు!
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ఫలితాల్లో గందరగోళానికి కారణమైన గ్లోబరీనా సంస్థ మోసాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఈ సంస్థ తీవ్రమైన నిర్లక్ష్యం.. నేడు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడేలా చేసింది. ఇక గ్లోబరినా ప్రైవేట్ లిమిటెడ్ ఐటి సొల్యూషన్స్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2017లో కాకినాడ జేఎన్టీయూలో ఈ సంస్థ మోసాలు బయటపడ్డాయి. కాకినాడ జేఎన్టీయూలో ఈ లెర్నింగ్. ఈ కంటెంట్ టెండర్లలో గ్లోబరీనా మోసాలకు పాల్పడిందని కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రూ.36 కోట్ల ఒప్పందంతో టెండర్ దక్కించుకున్న సంస్థ రూ.26 కోట్ల అవినీతికి పాల్పడిందని జేన్టీయూ కాకినాడ రిజస్టరే స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ సంస్థ మోసాలపై గతంలో సీపీఐ నారాయణ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఇక డీపీఆర్పీ ప్రాజెక్టులో భాగంగా గ్లోబరీనా సంస్థ పలుదశల్లో సాంకేతిక సేవలను ఇంటర్మీడియట్ బోర్డుకు అందించాలి. దీనికి అవసరమైన సమాచారాన్ని బోర్డు నుంచి సేకరించి.. కంప్యూటరీకరించడం, విశ్లేషించడం తదితర పనులు సమయానుగుణంగా చేయాలి. కానీ.. ఈ విషయంలో కనీసస్థాయిలో కూడా అనుభవంలేని గ్లోబరీనా సంస్థ టెండరు దక్కించుకున్నప్పటినుంచీ.. బోర్డుతో సమన్వయం చేసుకోవడంలో దారుణంగా విఫలమైంది. దీంతో ప్రాజెక్టు ఆసాంతం తీవ్ర గందరగోళంగా తయారైంది. -
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.
-
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. విజయవాడలోని గేట్‌వే హోటల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ రోజు మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి జనరల్, వొకేషనల్ కోర్సులకు సంబంధించిన అన్ని ఫలితాలను ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి.1,445 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా 10,31,285 మంది హాజరయ్యారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 5,23,099 మంది, రెండో సంవత్సర విద్యార్థులు 5,08,186 మంది ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఫస్ట్, సెకండియర్ ఫలితాలు ఒకేసారి విడుదల చేయడం ఇదే తొలిసారి అన్నారు. అలాగే ప్రాక్టికల్స్‌లో తొలిసారి జంబ్లింగ్ విధానం అమలు చేశామని, రికార్డు స్థాయిలో కేవలం 24 రోజుల్లో ఫలితాలు విడుదల చేశామన్నారు. మే 15 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అలాగే వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫలితాల్లో కూడా గ్రేడింగ్ విధానం అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి గంటా తెలిపారు. అలాగే 80 శాతం ఉత్తీర్ణతతో ఎప్పటిలాగే బాలికలే పైచేయిగా నిలిచారు. బాలురు 77శాతం ఉత్తీర్ణులు అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు విడుదల ఇంటర్ ఫస్టియర్‌లో 77 శాతంతో కృష్ణాజిల్లా ప్రథమ స్థానం, నెల్లూరు జిల్లా (69 శాతం) ద్వితీయ, పశ్చిమ గోదావరి జిల్లా (67శాతం) తృతీయ స్థానంలో నిలిచాయి. అలాగే ద్వితీయ సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో 86 శాతంతో కృష్ణాజిల్లా టాప్‌లో నిలవగా, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు సెకండ్ (80శాతం), గుంటూరు జిల్లా (79శాతం) మూడో స్థానంలో నిలిచాయి. ఇక ప్రథమ, ద్వితీయ ఇంటర్ ఫలితాల్లో వైఎస్ఆర్ కడప జిల్లా చివరస్థానంలో నిలిచింది. గత ఏడాది ఏప్రిల్ 20న ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల చేయగా, ఈసారి అంతకన్నా వారం రోజులు ముందుగా విడుదల చేశారు. విద్యార్ధులు తమ పరీక్ష ఫలితాలను ‘సాక్షి, సాక్షి ఎడ్యుకేషన్.కామ్’ www.sakshi.com, www.sakshieducation.com లో చూసుకోవచ్చు. ఈ సేవ, మీసేవ, రాజీవ్ సిటిజన్ సర్వీస్ సెంటర్లు, ఏపీ ఆన్లైన్ సెంట్లర్ల ద్వారా కూడా పరీక్ష ఫలితాల సమాచారాన్ని పొందవచ్చని బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఎస్ఎంఎస్ల ద్వారా ఫలితాల సమాచారం తెలిపే ఏర్పాట్లు చేశారు. ఇంటర్ ఫస్టియర్.... ఫలితాల్లో కృష్ణాజిల్లాకు (77శాతం) మొదటి స్థానం రెండోస్థానంలో నెల్లూరు జిల్లా (69) మూడో స్థానంలో పశ్చిమ గోదావరి (67 శాతం) ఫస్టియర్ లో 64 శాతంమంది విద్యార్థులు ఉత్తీర్ణత A-గ్రేడ్- 1,67,194 మంది విద్యార్థులు B-గ్రేడ్ .... 87,346 C-గ్రేడ్... 41,451 D-గ్రేడ్... 18,480 సెకండియర్... కృష్ణాజిల్లా 86 శాతంతో తొలి స్థానం రెండో స్థానంలో నెల్లూరు, చిత్తూరు జిల్లా (80 శాతం) మూడో స్థానంలో గుంటూరు (79 శాతం) రెండో సంవత్సరంలో 77 శాతంమంది విద్యార్థులు ఉత్తీర్ణత A-గ్రేడ్- 2,09,248 మంది విద్యార్థులు B-గ్రేడ్ .... 82,530 C-గ్రేడ్... 30,400 D-గ్రేడ్... 8,810 ఎంపీసీలో ఫస్ట్ ర్యాంక్- షేక్ షర్మిల (992 మార్కులు) ఎంపీసీలో సెకండ్ ర్యాంక్- దోసపాటి సాయివంశీ (992) థర్డ్ ర్యాంక్- లోకేశ్ బాబు (991) బైపీసీలో ఫస్ట్ ర్యాంక్ - ఆలపాటి నైమిషా (991) సెకండ్ ర్యాంక్ - పసుపులేటి లీమ (990) థర్డ్ ర్యాంక్ - ఎస్. హారిక (990) సీఈసీలో ఫస్ట్ ర్యాంక్ - యుక్త (969) సెకండ్ ర్యాంక్ - డి పల్లవి (965) థర్డ్ ర్యాంక్ - మహేశ్వరి (965)


