AP Inter Results 2022: ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల

AP Inter Results 2022 Released Check1st And 2nd Year Intermediate Result Here - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంటర్మీడియట్‌ ఎగ్జామ్స్‌ -2022 ఫ‌లితాలు వచ్చేశాయ్‌. బుధ‌వారం మ‌ధ్యాహ్నం విజ‌య‌వాడ‌లో విద్యాశాఖ మంత్రి బొత్స‌ స‌త్య‌నారాయ‌ణ ఏపీ ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను విడుద‌ల‌ చేసి.. మీడియాతో ఫలితాల గురించి మాట్లాడారు.

ఫస్టియర్‌లో 2,41,591 మంది పాస్‌ కాగా, ఫస్టియర్‌లో 54 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. సెకండియర్‌లో 2,58,449 మంది పాస్ కాగా, 61 ఉత్తీర్ణత శాతం రికార్డు అయ్యింది.  ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉంది.

ఉత్తీర్ణతలో కృష్ణా జిల్లా టాప్‌గా నిలిచిందని, రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం జూన్‌ 25వ తేదీ నుంచి జులై 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

రికార్డు స్థాయిలో 28 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. జవాబు పత్రాల మూల్యాంకనాన్ని వేగంగా, జాగ్రత్తగా పూర్తి చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఇంట‌ర్ ఫ‌లితాల‌ను సాక్షిఎడ్యుకేషన్‌.కామ్(www.sakshieducation.com)లో చూడొచ్చు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top