సోషల్ మీడియాలో క్రేజ్‌కోసం ఎ లాంటి పనిచేయడానికైనా వెనుకాడటం లేదు. ప్రాణాలు పోతున్నా పట్టించు కోవడం లేదు. తాజాగా రష్యన్ మహిళ నిర్వాకం ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
రష్యాకు చెందిన ఒక మహిళ లగ్జరీ కారునే బాత్రూమ్‌గా మార్చేసింది. మార్పులు చేర్పులు చేసిన మెర్సిడెస్ కారులో ప్రయాణిస్తూ జుట్టును వాష్ చేసుకుంది. నడిరోడ్డుపై పోతూ పొడవాటి తన జుట్టుకు షాంపూ పూసుకోవడం, నీళ్లతో కడుక్కోవడం,టవల్ చుట్టుకోవడం లాంటి తతంగాన్నంతా పూర్తి చేసింది. కార్లో వెడుతూనే జుట్టు కడుక్కున్న వైనం నెట్టింట దుమారాన్ని రేపుతోంది.
⚡️🚨 شابة روسية تقوم بغسل شعرها اثناء مرور سياره مرسيدس محوله السياره إلى حمام منزلي مما أثارت جدل واسع جداً بطريقتها الغريبة . pic.twitter.com/KILM9cZgzp
— موسكو | 🇷🇺 MOSCOW NEWS (@M0SC0W0) April 9, 2026
;
ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?
దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేలం వెర్రి అని తిట్టిపోస్తున్నారు. అంత పెద్ద జుట్టునుఅలా వాష్ చేసుకుంటోంది...పొరపాటున ఆ జుట్టు టైర్ల కింద పడితే పరిస్థితి ఏంటి అంటూ మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్ చేస్తే!


