శ్రీలీల.. తక్కువకాలంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది. సన్నజాజి తీగలా ఉండే ఈ బ్యూటీ తన డ్యాన్స్ స్టెప్పులతో మరింత ట్రెండ్ అయింది. అయితే తాను నటించిన చాలా పాటలు పీరియడ్స్‌లో ఉండగానే చిత్రీకరణ జరిగాయంటోంది. తాజాగా ఓ ఈవెంట్‌లో శ్రీలీల మాట్లాడుతూ.. 'నేను చాలా పాటలకు డ్యాన్స్ చేశాను. అందులో హిట్ సాంగ్స్ అన్నీ దాదాపు నెలసరి సమయంలో చేసినవే! సమానత్వం కోరుకున్నప్పుడు మనం పీరియడ్స్‌ను సాకుగా చూపించకూడదని నా అభిప్రాయం.
సాకుగా చూపించొద్దు
మనం శారీరకంగా, మానసికంగా అన్నింటిని అధిగమించి ముందుకు సాగాలి. పురుషులతో సమానంగా అవకాశాలు, అధికారం, హక్కులు కోరుతున్నప్పుడు నెలసరి వంటి సమస్యలను సాకుగా చూపించి వెనక్కు తగ్గడం కరెక్ట్ కాదు. మనల్ని మనం ముందుకు నెట్టుకోవాలి' అని పేర్కొంది. అయితే ఆమె కామెంట్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెలసరిలో అందరి పరిస్థితి ఒకేలా ఉండదని, దాన్ని ఎవరూ కావాలని సాకుగా చూపించరని కామెంట్లు చేస్తున్నారు.
తప్పేముంది?
డాక్టర్ చదివిన శ్రీలీలకు ఈ విషయం ఎందుకు అర్థం కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో.. పీరియడ్స్‌లో ఉన్నప్పుడు కూడా పనిచేసేవారు ఎంతమంది లేరు, ఆ ఉద్దేశంతోనే ధైర్యంగా ముందుకు వెళ్లాలని చెప్పిందే తప్ప.. తప్పుగా ఏం మాట్లాడిందని మరికొందరు శ్రీలీలను సమర్థిస్తున్నారు. ఇకపోతే శ్రీలీల చివరగా ఉస్తాద్ భగత్ సింగ్‌లో నటించింది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
చదవండి: నన్ను డ్రమ్ములో పెడతారట.. బండబూతులు తిడుతున్నారు: నటుడు


