నన్ను డ్రమ్ములో పెడతారట.. బండబూతులు తిడుతున్నారు! | Actor Siddharth Shaw on getting hate for his character in Chiraiya | Sakshi
Sakshi News home page

Siddharth Shaw: బెడ్‌రూమ్‌ సీన్స్.. ఐదు నిమిషాలు గట్టిగా ఏడ్చేశా..

Apr 9 2026 1:50 PM | Updated on Apr 9 2026 2:08 PM

Actor Siddharth Shaw on getting hate for his character in Chiraiya

చిరయ్యా.. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో ఈ సిరీస్‌ ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో నటుడు సిద్దార్థ్‌ షా ప్రధాన పాత్రలో నటించాడు. భార్య వ్యక్తిగత స్వేచ్ఛకు, అభిప్రాయానికి విలువ ఇవ్వని భర్తగా కనిపించాడు. అయితే ఈ సిరీస్‌ రిలీజయ్యాక తనను ప్రజలు ఎంతగానో ద్వేషిస్తున్నారంటున్నాడు నటుడు సిద్దార్థ్‌ షా. అతడు మాట్లాడుతూ.. 'జనం నన్ను బ్లూ డ్రమ్‌లో పెట్టి చంపుదామన్నంత కసితో ఉన్నారు. 

బండబూతులు
ముఖ్యంగా మహిళలే ఈరకంగా వయొలెంట్‌గా ఆలోచిస్తున్నారు. పురుషులేమో బండబూతులు తిడుతున్నారు. చాలాచోట్ల ఇదే జరుగుతోందని, ఇప్పుడు ఈ సిరీస్‌ చూసి పురుష సమాజం తేలు కుట్టిన దొంగలా మౌనంగా ఉండిపోయిందని పలువురూ రీల్స్‌, వీడియోలు చేస్తున్నారు. ఈ ద్వేషాన్ని చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. ఆ కోపంలోనూ ప్రేమే కనిపిస్తోంది. 

బెడ్‌రూమ్‌ సీన్స్‌
నాపై పీకలదాకా కోపం ఉందంటే నాకిచ్చిన పాత్రకు పూర్తి స్థాయి న్యాయం చేశానన్నమాట! అయితే ఇంటిమేట్‌ (బెడ్‌రూమ్‌) సన్నివేశాలు షూట్‌ చేసేటప్పుడు మాత్రం నేను తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనయ్యాను. మొదటిరోజే బెడ్‌రూమ్‌ సీన్స్‌ షూట్‌ చేశారు. ఫస్ట్‌ సీన్‌ తీయడానికి ముందే ఐదునిమిషాల పాటు గట్టిగా ఏడ్చేశాను. దీంతో కాసేపు చిత్రీకరణ నిలిపివేశారు. అందరూ నన్ను ఓదార్చేందుకు ప్రయత్నించారు. అయినా సరే ఆ సీన్స్‌ షూట్‌ చేసేటప్పుడు టెన్షన్‌తో బిగుసుకుపోయాను. 

తీవ్ర సంఘర్షణ
నా శరీరం ముందుకు కదల్లేదు. ఇలా చాలాసార్లు జరిగింది. ఆరు నెలలపాటు ఈ సిరీస్‌ నుంచి నేను బయటకు రాలేకపోయాను. ఎందుకంటే అవి ప్రేమ సన్నివేశాలు కావు, భార్యపై జరిగే అత్యాచార సీన్స్‌. హనీమూన్‌ సీన్‌ తర్వాత అయితే తీవ్ర సంఘర్షణకు లోనయ్యాను. ఇకపోతే ఆ సన్నివేశాలను నా కుటుంబం ధైర్యంగా తెరపై చూడలేకపోయింది' అని సిద్దార్థ్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: అత్తామామకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన నయనిక రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement