విజయ్‌కు షాక్‌.. పోటీ చేయకముందే ఓటమి | TVK MLA nomination rejected | Sakshi
Sakshi News home page

విజయ్‌కు షాక్‌.. పోటీ చేయకముందే ఓటమి

Apr 8 2026 5:40 PM | Updated on Apr 8 2026 6:24 PM

TVK MLA nomination rejected

టీవీకే అధినేత విజయ్‌కి ఎన్నికల ముందు ఊహించని షాక్‌ తగిలింది. ఎడప్పాడి నియోజకవర్గం నుంచి టీవీకే తరపున బరిలోకి దిగుతున్న అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్ని ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేయకముందే టీవీకే ఒక స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

ఎడప్పాడీ నియోజకవర్గంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల కమిషన్ నియామాల ప్రకారం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అభ్యర్థి నామినేషన్‌పై పదిమంది ప్రపోజర్ల సంతకాలు ఉండాలి. అయితే టీవీకే తరుపున పోటీ చేస్తున్న అరుణ్ కుమార్‌ అనే అభ్యర్థి నామినేషన్‌ పత్రాలపై ఎనిమిది మంది సంతకాలు మాత్రమే ఉండడంతో పత్రాల్ని రిజెక్ట్ చేశారు. అంతే కాకుండా అతనికి ప్రత్యామ్నయంగా నామినేషన్ దాఖలు చేసిన మరో అభ్యర్థి నిత్య నామినేషన్ పత్రాలు కూడా ఏడుగురు అభ్యర్థుల సంతకాలు ఉండడంతో రిజెక్ట్ అయ్యింది.

అయితే ఈ నియోజకవర్గం నుంచి ఏఐడీఏంకే అధ్యక్షుడు కెె. పళనిస్వామి పోటీ చేస్తున్నారు. అయికే ప్రస్తుతం టీవీకే ఎమ్మెల్యే అభ్యర్థి అరుణ్‌ కుమార్‌ ప్రస్తుతం అదృశ్యం అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో వీరి నామినేషన్ రిజెక్ట్‌ కావడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతే కాకుండా  దీంతో ఆయనను ఏవరైనా కిడ్నాప్‌ చేసి ఉండవచ్చని పార్టీ వర్గాలు ఆందోళన చేస్తున్నాయి. కాగా తమిళనాడులో ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 

Advertisement
 
Advertisement
Advertisement