భోజనం తరువాత 30 నిమిషాల కంటే.. 10 స్క్వాట్‌లు బెటర్ : బ్రయాన్ జాన్సన్
యాంటీ-ఏజింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్ బ్రయాన్ జాన్సన్ గుర్తున్నాడా? మరణాన్ని జయించాలని చూస్తున్న అమెరికా టెక్ వ్యాపారవేత్త బ్రయాన్ మరో సరికొత్త చిట్కాను పంచుకున్నాడు. భోజనం తర్వాత 30 నిమిషాల నడక కంటే 10 స్క్వాట్‌లు చేయడం మేలంటూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
గుండె ఆరోగ్యం, రక్తంలో చక్కెర నియంత్రణ కోసం భోజనం తర్వాత నడవడం చాలా మంచిదని పలువురు వైద్యులు, నిపుణులు చెబుతున్న మాట. అయితే అనేక ప్రయోగాలు, మందులు, ఆహార అలవాట్లతో యువకుడిగా మారిన బ్రయాన్ జాన్సన్ వాకింగ్ కంటే 10 స్క్వాట్‌లు ఉత్తమమని చెబుతున్నాడు. స్క్వాట్‌లతో చాలా తక్కువ టైంలోనే చక్కటి జీవక్రియ ప్రయోజనాలను అందిస్తుందని జాన్సన్ వాదన.
"30 నిమిషాల నడక కంటే రక్తంలో చక్కెర నియంత్రణ కోసం, ప్రతి 45 నిమిషాలకు 10 స్క్వాట్‌లు చేయడం అనేది, కేవలం 30 నిమిషాల నడక కంటే 14 శాతం ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తుంది," అని జాన్సన్ పేర్కొన్నాడు.. "అధిక బరువు మరియు ఊబకాయం ఉన్న పురుషులలో, మధ్యమధ్యలో కూర్చోవడం వల్ల కండరాల కదలిక పెరిగి గ్లైసెమిక్ నియంత్రణ మెరుగుపడుతుంది" అనే శీర్షికతో ఉన్న 2024 అధ్యయనాన్ని ఆయన ఉటంకించం గమనార్హం. శరీరంలో క్వాడ్స్ (తొడ కండరాలు), గ్లూట్స్ (పిరుదుల కండరాలు) అతిపెద్ద 'గ్లూకోజ్ స్పాంజ్‌లు' అని, స్క్వాట్‌లు చేయడం వల్ల అవి సమర్థవంతంగా ఉత్తేజితమవుతాయని జాన్సన్ వివరించారు. (నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్ చేస్తే!)
10 squats beats a 30 min walk.
For blood sugar control after a meal, doing 10 squats every 45 minutes outperforms a dedicated 30 min walk by 14%.
The mechanism: your quadriceps and glutes are the largest glucose sponge in your body. Activating them repeatedly clears more… pic.twitter.com/OMmfVGqRUY— Bryan Johnson (@bryan_johnson) April 9, 2026
క్వాడ్రిసెప్స్, గ్లూట్స్ శరీరంలో అతిపెద్ద గ్లూకోజ్ స్పాంజ్‌లు. వీటిని తరచుగా ఉత్తేజపరచడం ద్వారా ఒకేసారి చేసే ప్రయత్నంలో కంటే ఎక్కువ గ్లూకోజ్ తొలగించబడుతుంది. 30 నిమిషాల నడక తప్పు కాదు, కానీ అది అంత సమర్థవంతమైనది కాదని బ్రయాన్ తెలిపాడు. అంతేకాదులో పనిలో లేదా కార్యాలయంలో ఎక్కువ గంటలు కూర్చునే అలవాటును విడనాడటం వల్ల ఈ 14 శాతం ప్రయోజనం లభించిందని జాన్సన్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?
ఖచ్చితంగా చెప్పాలంటే, ఎక్కువసేపు కూర్చున్న తర్వాత ఒకేసారి నడవడంతో పోలిస్తే, అధిక బరువు మరియు ఊబకాయం ఉన్న పురుషులలో చిన్నపాటి నడక లేదా స్క్వాటింగ్ విరామాలు గ్లైసెమిక్ నియంత్రణను సమర్థవంతంగా మెరుగుపరుస్తాయని 2024 అధ్యయనం వెల్లడించింది. ఆ 14 శాతం ప్రయోజనం ప్రతి 45 నిమిషాలకు కూర్చోవడాన్ని విరామం ఇవ్వడం వల్ల వచ్చింది, అంతేగానీ ప్రత్యేకంగా స్క్వాట్స్ చేయడం వల్ల కాదు. ప్రతి 45 నిమిషాలకు కొద్దిసేపు నడవడం కూడా స్క్వాట్స్‌తో సమానంగా పని చేస్తుందని ఈ స్టడీ తెలిపింది.
నెటిజన్ల స్పందన
ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో, ఈ విధానంపై దాదాపు అందరూ సానుకూల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. భోజనం తర్వాత నడవడానికి తగినంత సమయం లేని వారు ఇప్పుడు కేవలం స్క్వాట్స్ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని సోషల్ మీడియా వినియోగదారులు సూచించారు.
"చాలా సులభం, అయినా అద్భుతంగా ప్రభావవంతమైనది," అని ఒకరు,"భోజనం చేసిన వెంటనే నడవడానికి సమయం లేకపోతే, ఇది మంచి పద్ధతు అని మరొకరు వ్యాఖ్యనించారు. "అవును, నిజమే. రోజుకు ఒకసారి 30 నిమిషాలు నడిచి, మిగిలిన 8 గంటలు కూర్చోవడం మీ జీవక్రియను పూర్తిగా కాపాడదు. దానికి బదులుగా, భోజనం తర్వాత ప్రతి గంటకు మీ కుర్చీలోంచి లేచి 10 స్క్వాట్స్ చేయడం రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని కమెంట్ చేశారు.


