breaking news
squat
-
మధుమేహం, అధిక బరువు : బ్రయాన్ జాన్సన్ చిట్కా
యాంటీ-ఏజింగ్ ఇన్ఫ్లుయెన్సర్ బ్రయాన్ జాన్సన్ గుర్తున్నాడా? మరణాన్ని జయించాలని చూస్తున్న అమెరికా టెక్ వ్యాపారవేత్త బ్రయాన్ మరో సరికొత్త చిట్కాను పంచుకున్నాడు. భోజనం తర్వాత 30 నిమిషాల నడక కంటే 10 స్క్వాట్లు చేయడం మేలంటూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.గుండె ఆరోగ్యం, రక్తంలో చక్కెర నియంత్రణ కోసం భోజనం తర్వాత నడవడం చాలా మంచిదని పలువురు వైద్యులు, నిపుణులు చెబుతున్న మాట. అయితే అనేక ప్రయోగాలు, మందులు, ఆహార అలవాట్లతో యువకుడిగా మారిన బ్రయాన్ జాన్సన్ వాకింగ్ కంటే 10 స్క్వాట్లు ఉత్తమమని చెబుతున్నాడు. స్క్వాట్లతో చాలా తక్కువ టైంలోనే చక్కటి జీవక్రియ ప్రయోజనాలను అందిస్తుందని జాన్సన్ వాదన."30 నిమిషాల నడక కంటే రక్తంలో చక్కెర నియంత్రణ కోసం, ప్రతి 45 నిమిషాలకు 10 స్క్వాట్లు చేయడం అనేది, కేవలం 30 నిమిషాల నడక కంటే 14 శాతం ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తుంది," అని జాన్సన్ పేర్కొన్నాడు.. "అధిక బరువు మరియు ఊబకాయం ఉన్న పురుషులలో, మధ్యమధ్యలో కూర్చోవడం వల్ల కండరాల కదలిక పెరిగి గ్లైసెమిక్ నియంత్రణ మెరుగుపడుతుంది" అనే శీర్షికతో ఉన్న 2024 అధ్యయనాన్ని ఆయన ఉటంకించం గమనార్హం. శరీరంలో క్వాడ్స్ (తొడ కండరాలు), గ్లూట్స్ (పిరుదుల కండరాలు) అతిపెద్ద 'గ్లూకోజ్ స్పాంజ్లు' అని, స్క్వాట్లు చేయడం వల్ల అవి సమర్థవంతంగా ఉత్తేజితమవుతాయని జాన్సన్ వివరించారు. (నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్ చేస్తే!)10 squats beats a 30 min walk.For blood sugar control after a meal, doing 10 squats every 45 minutes outperforms a dedicated 30 min walk by 14%.The mechanism: your quadriceps and glutes are the largest glucose sponge in your body. Activating them repeatedly clears more… pic.twitter.com/OMmfVGqRUY— Bryan Johnson (@bryan_johnson) April 9, 2026 క్వాడ్రిసెప్స్, గ్లూట్స్ శరీరంలో అతిపెద్ద గ్లూకోజ్ స్పాంజ్లు. వీటిని తరచుగా ఉత్తేజపరచడం ద్వారా ఒకేసారి చేసే ప్రయత్నంలో కంటే ఎక్కువ గ్లూకోజ్ తొలగించబడుతుంది. 30 నిమిషాల నడక తప్పు కాదు, కానీ అది అంత సమర్థవంతమైనది కాదని బ్రయాన్ తెలిపాడు. అంతేకాదులో పనిలో లేదా కార్యాలయంలో ఎక్కువ గంటలు కూర్చునే అలవాటును విడనాడటం వల్ల ఈ 14 శాతం ప్రయోజనం లభించిందని జాన్సన్ స్పష్టం చేశారు. ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?ఖచ్చితంగా చెప్పాలంటే, ఎక్కువసేపు కూర్చున్న తర్వాత ఒకేసారి నడవడంతో పోలిస్తే, అధిక బరువు మరియు ఊబకాయం ఉన్న పురుషులలో చిన్నపాటి నడక లేదా స్క్వాటింగ్ విరామాలు గ్లైసెమిక్ నియంత్రణను సమర్థవంతంగా మెరుగుపరుస్తాయని 2024 అధ్యయనం వెల్లడించింది. ఆ 14 శాతం ప్రయోజనం ప్రతి 45 నిమిషాలకు కూర్చోవడాన్ని విరామం ఇవ్వడం వల్ల వచ్చింది, అంతేగానీ ప్రత్యేకంగా స్క్వాట్స్ చేయడం వల్ల కాదు. ప్రతి 45 నిమిషాలకు కొద్దిసేపు నడవడం కూడా స్క్వాట్స్‌తో సమానంగా పని చేస్తుందని ఈ స్టడీ తెలిపింది.నెటిజన్ల స్పందనఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో, ఈ విధానంపై దాదాపు అందరూ సానుకూల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. భోజనం తర్వాత నడవడానికి తగినంత సమయం లేని వారు ఇప్పుడు కేవలం స్క్వాట్స్ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని సోషల్ మీడియా వినియోగదారులు సూచించారు."చాలా సులభం, అయినా అద్భుతంగా ప్రభావవంతమైనది," అని ఒకరు,"భోజనం చేసిన వెంటనే నడవడానికి సమయం లేకపోతే, ఇది మంచి పద్ధతు అని మరొకరు వ్యాఖ్యనించారు. "అవును, నిజమే. రోజుకు ఒకసారి 30 నిమిషాలు నడిచి, మిగిలిన 8 గంటలు కూర్చోవడం మీ జీవక్రియను పూర్తిగా కాపాడదు. దానికి బదులుగా, భోజనం తర్వాత ప్రతి గంటకు మీ కుర్చీలోంచి లేచి 10 స్క్వాట్స్ చేయడం రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని కమెంట్ చేశారు. -
జీన్స్ తొడుక్కుని స్క్వాటింగ్ చేస్తున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్
ఆధునిక కాలంలో జీన్స్ ప్యాంట్లు లేనిదే కాలం గడవదు. ట్రెండ్‌కు,ఫ్యాషన్‌కు తగ్గట్టు అనేక రకాల జీన్స్ ప్యాంట్లు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. మహిళలతో పోల్చితే పురుషులే ఎక్కువగా జీన్ ప్యాంట్లను వినియోగిస్తారు. ఆఫీసులకు, బయటికి వెళ్లినప్పుడు, పార్టీలకు ఇలా ఏదైనా జీన్స్ ప్యాంట్లకే ప్రాధాన్యత ఉంటుంది. అన్ని వయసుల వారికి ఫిట్ అయ్యే జీన్స్ అనేవి చాలా పాపులర్. అనేక రకాల మోడల్స్‌లో ఇవి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ధరించడం వలన చాలా కంఫర్ట్ గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. వీటిని ఉతుక్కోవడం ఈజీ కావడం కూడా వీటికి ఆదరణ ఎక్కువ. కానీ జీన్స్పాంట్లు వేసుకున్నపుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.జీన్స్ వేసుకొని కింద కూర్చోవడం, అందునా జీన్స్ ప్యాంట్లు తొడిగి బాసిపట్లు వేయడం (సక్లముక్లం వేసి కూర్చోవడం) ఆరోగ్యానికి అంత మేలు కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. జీన్స్ ప్యాంట్ తొడుక్కొని ఇలా కూర్చోవడం వల్ల కండరాలు, నరాలు దెబ్బతింటాయనీ, ఇది మరీ విషమిస్తే ఒక్కోసారి జీన్స్ ప్యాంట్లతో బాసిపట్లు వేసుకుని కూర్చునేవారు పైకి లేవగానే నడవలేని పరిస్థితి వచ్చేందుకూ అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఇక వ్యాయామం చేసే సమయంలోనూ జీన్స్ అస్సలు తొడుక్కోవద్దనీ, వాటిని తొడిగి ‘స్క్వాటింగ్’ ఎక్సర్సైజ్ చేయడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. ఈ అంశాలన్నింటినీ ‘జర్నల్ ఆఫ్ న్యూరాలజీ, న్యూరోసర్జరీ, సైకియాట్రీ’ అనే మెడికల్ జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి. అవే కాకుండా బాగా బిగుతుగా ఉండే జీన్స్ వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశముందని కూడా మరికొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.జీన్స్ ప్యాంట్లు బాగా టైట్‌గా ఉండే జీన్స్ ప్యాంట్ ధరించి పడుకుంటే చర్మంపై బ్యాక్టీరియా పెరుగుతుంది. స్కిన్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీంతో దురదలు, చర్మంపై ర్యాషెస్, దద్దుర్లు వస్తాయి. రక్తప్రసరణకు కష్టం : జీన్స్ ప్యాంట్ బిగుతుగా ఉండటంతో రక్తప్రసరణకు ఇబ్బంది కలుగుతుంది. దీంతో కొన్ని అవయవాలకు రక్తం సరిగా అందదు. జీన్స్ ప్యాంట్ ధరించి నిద్రించడం వల్ల శరీరంలోని వేడీ పెరుగుతుంది. పేగుల కదలికకు ఇబ్బందిగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియపై దుష్ప్రభావం పడుతుంది. -
గుంజీలు తీయండి..ఫ్రీగా బస్సు టిక్కెట్ పొందండి!
చిన్నప్పుడూ తప్పు చేస్తే గుంజీలు తీసే పనిష్మెంట్ ఇచ్చేవారు మాష్టార్లు. ఇది అందరికి అనుభవమే. ఐతే ఇక్కడొక దేశంలో మాత్రం ప్రజలు గుంజీలు తీసి.. ఫ్రీగా బస్సు టిక్కెట్ పొందుతారు. ఇదేంటి అని అనుకుంటున్నారా!. ఔను అక్కడ సుమారు 20 గుంజీలు తీస్తే.. ఫ్రీగా బస్సులో తిరిగేయవచ్చు. యూరప్‌లోని రొమానియా అనే నగరంలో అక్కడి ప్రభుత్వం ప్రజలకు ఇలాంటి మంచి ఆఫర్‌ని అందిస్తోంది. దీన్ని అక్కడి ప్రభుత్వం స్పోర్ట్స్ ఫెస్టివల్ అనే ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా ఈ అద్భుతమైన ఆఫర్‌ని ప్రజలకు ఇస్తోంది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా దీన్ని ప్రవేశపెట్టిందట అక్కడి ప్రభుత్వం. ఈ ఉచిత టిక్కెట్‌ను అక్కడి ప్రజలు హెల్త్ టిక్కెట్‌గా పిలుస్తారు. అంతేకాదండోయ్ కేవలం రెండు నిమిషాల్లో 20 గుంజీలు తీస్తేనే ఫ్రీగా బస్సు టిక్కెట్ పొందగలరు. అందుకు సంబంధించిన వీడియోని అలీనా బ్జోల్కినా అనే వినియోగదారుడు ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో... ఒక అమ్మాయి ఒక మిషన్ బూత్ ముందు నిలబడి 20 గంజీలు తీస్తుంది. అయిపోగానే టిక్కెట్ మిషన్ నుంచి బయటకు వచ్చినట్లు కనిపిస్తోంది. View this post on Instagram A post shared by Алина Бжолка (@alinabzholkina) (చదవండి: అంతా ఈజీ కాదు దొంగతనం! ఎంత కూల్‌గా దొంగను బంధించాడు!) -
బికినీ భామ భలేగా చేసింది!
ఒక మనిషిని ఎత్తుకుని మోయడం మామూలు మనుషులకు కష్టమైన పనే. బరువులు ఎత్తుతూ నిరంతరం సాధన చేసే వారు మాత్రమే ఇలాంటి విన్యాసాలు చేయగలరు. భారీ కసరత్తులు చేసే వారికి మాత్రమే ఇది సాధ్యపడుతుంది. అయితే ఓ యువతి ఈ ఫీట్ ఈజీగా చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. భుజంపై బరువుతో బీచ్ లో ఆమె చేసిన కసరత్తులు చూసిన వారంతా నోరెళ్లబెడుతున్నారు. బికినీ భామ తన సోదరిని భుజాలపైకి ఎత్తుకుని పుస్కీలు తీసింది. ఏ మాత్రం అలుపులేకుండా ఈ కసరత్తులు చేసింది. ఆగకుండా 12 సార్లు పుస్కీలు తీసి ఔరా అనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. అయితే వీళ్లు ఎక్కడి వారు, ఎక్కడ ఈ విన్యాసం చేశారనే వివరాలు వీడియోలో లేవు.


