సీతారామం మూవీలో తన నటనతో అదరగొట్టింది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీత పాత్రలో జీవించేసింది. ఇకపోతే ఈమె ప్రధాన పాత్రలో నటించిన డెకాయిట్ నేడు (ఏప్రిల్ 10న) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
ఇటీవల ఈ సినిమా ఈవెంట్‌లో మృణాల్.. చీర కట్టు, నుదుటన బొట్టుతో ఎంతో ట్రెడిషనల్‌గా రెడీ అయింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు మృణాల్.. సీతామహాలక్ష్మిలా ఉంది, మా దిష్టే తగిలేలా ఉందని కామెంట్లు చేస్తున్నారు.


