సాయితేజ్, వేద జలంధర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. మునిరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను హీరో కిరణ్ అబ్బవరం నిర్మించారు. ఈ చిత్రం ఏప్రిల్ 17న రిలీజ్ కానుంది.
ఈ క్రమంలో బుధవారం (ఏప్రిల్ 9న) ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కిరణ్ అబ్బవరం చెన్నకేశవరెడ్డి గెటప్‌లో వచ్చారు. హీరో ముఠామేస్త్రి గెటప్‌లో, హీరోయిన్ శ్రీదేవి గెటప్‌లో ఆకట్టుకున్నారు. ఆన్‌లైన్‌లో ట్రైలర్‌ను హీరో వెంకటేశ్ రిలీజ్ చేశారు.


