75 హార్డ్ ఛాలెంజ్: బోహో గర్ల్ కృతిక వెయిట్‌ లాస్‌ జర్నీ | 5 Kg In 75 Days What Boho Girl Kritika Khurana Ate | Sakshi
Sakshi News home page

75 హార్డ్ ఛాలెంజ్: బోహో గర్ల్ కృతిక వెయిట్‌ లాస్‌ జర్నీ

Apr 10 2026 7:18 PM | Updated on Apr 10 2026 7:25 PM

5 Kg In 75 Days What Boho Girl Kritika Khurana Ate

కృతికా ఖురానా  "దట్‌ బోహో గర్ల్"  (@thatbohogirl) గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ భారతీయ ఫ్యాషన్ , లైఫ్‌స్టైల్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్ రెండున్నర నెలల్లో 5 కిలోల బరువును తగ్గించుకుంది.   75 హార్డ్ ఛాలెంజ్ ద్వారా బరువు తగ్గి, తన ఫిట్‌నెస్ ప్రయాణాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది.  దీంతో ఆమె  వెయిట్‌లాస్‌ జర్నీ వైరల్‌గా మారింది.

ఢిల్లీకి చెందిన కృతికా తన విభిన్నమైన బోహో-చీక్ స్టైల్, ఫ్యాషన్  అండ్‌ పర్సనల్ వ్లాగ్స్‌తో  సోషల్‌ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించుకుంది.  ఇన్‌స్టాగ్రామ్  యూట్యూబ్‌లో మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. తాజాగా తాను '75 హార్డ్' ఛాలెంజ్‌ను అనుసరించి కేవలం 75 రోజుల్లోనే దాదాపు 5 కిలోల బరువు ఎలా తగ్గిందో ఆమె వెల్లడించింది.కృతిక ఖురానా తాను దాదాపు 66 కిలోల నుండి 61 కిలోలకు తగ్గినట్లు  చెప్పింది. ఈ సంఖ్య చిన్నదిగా అనిపించినప్పటికీ, ఆమె కేవలం బరువుపై కాకుండా, నిలకడ  క్రమశిక్షణపైనే స్పష్టంగా ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలిపింది. 

శారీరక మార్పుతో పాటు,  మానసికంగా కూడా తనలో చాలా మార్పు వచ్చిందని, టోటల్‌గా తను ‍ క్రమశిక్షణతో బలంగా మారానని వెల్లడించింది. తగినంత నీరు త్రాగడం, ప్రతిరోజూ చదవడం,   రోజుకు 10వేల అడుగులు నడవడం వంటి కొన్ని అలవాట్లు శాశ్వతంగా ఉంటాయని కూడా ఆమె పంచుకుంది.

కృతిక పాటించిన  నియమాలు
45 నిమిషాల వ్యాయామం
దాదాపు 3.7 లీటర్లు) నీరు
అనవసరమైన ఆహార నియమాలు, చీట్ మీల్స్ లేకుండా
అస్సలు మద్యం సేవించకపోవడం
ఒక పుస్తకంలోని 10 పేజీలు చదవడం
ప్రతిరోజూ తన పురోగతిని ఫోటో తీసుకోవడం

'75 హార్డ్' అంటే ఏమిటి :  ఇది మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంపై దృష్టి సారించే ఒక క్రమశిక్షణ ఆధారిత ఛాలెంజ్. ఇందులో వ్యాయామాలు, ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నీరు తాగడం, స్వీయ-అభివృద్ధి వంటి రోజువారీ తప్పనిసరి నియమాలు ఉంటాయి.

ఇదీ చదవండి: షుగర్‌ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?

నోట్‌ : కఠినమైన ఆహార నియమాలు, జిమ్‌లో ఎక్కువ కసరత్తులు లాంటివి  గందరగోళ సలహాలు చాలా వింటాం.  కానీ వాస్తవానికి బరువు తగ్గడం అనేది నిలకడతో, నిబద్ధతతో చేయాల్సిన పని. తక్షణ పరిష్కారాలు ఆకర్షణీయంగా కనిపించి నప్పటికీ, సాధారణ వ్యాయామాలు క్రమశిక్షణ, చిన్న చిన్న పనులను ప్రతిరోజూ పునరావృతం చేసినప్పుడే నిజమైన మార్పు వస్తుంది. 

ఇదీ చదవండి: బెంజ్‌ కారు, నడిరోడ్డులో తలస్నానం, తిట్టిపోస్తున్న నెటిజన్లు

Advertisement
 
Advertisement
Advertisement