ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ.. తన పుట్టిన రోజు వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి రాధికా మర్చెంట్ మాత్రమే కాకుండా.. రణవీర్ సింగ్, జాన్వీ కపూర్ వంటి సినీతారలు కూడా హాజరయ్యారు.
అనంత్ అంబానీ బర్త్‌డే సందర్భంగా.. జామ్‌నగర్‌లో వంతారా యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణ, వెటర్నరీ సైన్సెస్ కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ యూనివర్సిటీ కావడం విశేషం.
వన్యప్రాణుల సంరక్షణ, పశువైద్యంలో నిపుణులను తయారు చేయడం ఈ యూనివర్సిటీ లక్ష్యంగా పెట్టుకుంది.


