టీవీ రీచార్జ్‌ చేయించలేదని మహిళ ఆత్మహత్య

woman commit to suicide  - Sakshi

కర్నూలు, ఉయ్యాలవాడ: టీవీకి రీచార్జ్‌ చేయించలేదని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి వివరాల మేరకు..  ఇంజేడు గ్రామానికి చెందిన పచ్చర్ల వెంకటలక్ష్మమ్మ(45) టీవీ రీచార్జ్‌ చేయించాలని తన కుమారుడికి రూ. 300 అందజేసింది. అయితే అతడు రీచార్జ్‌ చేయించకుండా ఆ డబ్బుతో మద్యం సేవించి ఇంటికి చేరుకున్నాడు. తీవ్ర మనోవేదనకు గురైన తల్లి క్రిమి సంహారక మందు సేవించి అపస్మారక స్థితికి చేరుకుంది. తెలుసుకున్న భర్త, బంధువులు ఆళ్లగడ్డ వైద్యశాలకు తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతురాలి భర్త అంకాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top