మహిళపై టీడీపీ నేత అకృత్యం | Woman suicide In Rayadurgam | Sakshi
Sakshi News home page

మహిళపై టీడీపీ నేత అకృత్యం

Apr 5 2024 7:38 AM | Updated on Apr 5 2024 7:38 AM

Woman suicide In Rayadurgam - Sakshi

టీడీపీ నేత అకృత్యంతో అనంతపురం జిల్లా హోసగుడ్డంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.

అవమాన భారంతో ఆత్మహత్యకు పాల్పడిన వివాహిత 

రాయదుర్గం : టీడీపీ నేత అకృత్యంతో అనంతపురం జిల్లా హోసగుడ్డంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.  కురుబ కావేరి (26) అనే వివాహితపై లోకేశ్‌ అనే టీడీపీ నేత కన్నేశాడు. మార్చి 31 రాత్రి ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. నిద్రిస్తున్న ఆమె వద్దకు వెళ్లే ప్రయత్నంలో భర్త గోనప్ప కాలు తొక్కాడు. దీంతో మేల్కొన్న గోనప్ప లైటువేసి టీడీపీ నేతను పట్టుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

గొడవ పెద్దది కావడంతో లోకేశ్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై ఏప్రిల్‌ 1న కావేరి దంపతులు డి.హీరేహాళ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. టీడీపీ నేత లోకేశ్‌ అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఇన్నాళ్లు నాటకం ఆడాడు. కాగా.. గురువారం గ్రామంలోకి వచ్చి తిరుగుతూ కనిపించాడు. దీనిని అవమానంగా భావించిన కావేరి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. తన భార్య చావుకు లోకేశ్‌ కారణమని ఆమె భర్త గోనప్ప, తల్లి శకుంతలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement